US Military Aircraft: జపాన్ సమీపంలోని సముద్రంలో కూలిపోయిన యూఎస్ మిలటరీ విమానం.. 8 మంది మృతి..?!
అమెరికా మిలటరీ విమానం కూలిపోయిందన్న (US Military Aircraft) వార్త వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం.. అమెరికన్ సైనిక విమానం ఓస్ప్రే జపాన్ సమీపంలోని సముద్రంలో కూలిపోయింది.
- By Gopichand Published Date - 02:10 PM, Wed - 29 November 23

US Military Aircraft: అమెరికా మిలటరీ విమానం కూలిపోయిందన్న (US Military Aircraft) వార్త వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం.. అమెరికన్ సైనిక విమానం ఓస్ప్రే జపాన్ సమీపంలోని సముద్రంలో కూలిపోయింది. యకుషిమా దీప్ సమీపంలో విమానం కూలిపోయింది. అందులో మొత్తం ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. అయితే యుఎస్ మిలిటరీ వి-22 ఓస్ప్రే విమానం బుధవారం జపాన్‌లోని యకుషిమా ద్వీపం వద్ద సముద్రంలో కూలిపోవడంతో అందులో ఉన్న ఎనిమిది మంది మరణించారు. విమానంలో ఉన్నవారి భద్రతతో సహా ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఏమీ లేవని జపాన్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి తెలిపారు.
Also Read: Telangana Elections : భద్రతా వలయంలో ‘పోల్’ తెలంగాణ.. ఎన్నికల ‘ఘణాంకాలివీ’..
వార్తా సంస్థ రాయిటర్స్ నివేదిక ప్రకారం.. విమానంలో ఉన్న వ్యక్తుల భద్రతతో సహా సంఘటన గురించి ఎటువంటి వివరాలు తెలియలేదని జపాన్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. అమెరికా సైనిక విమానం సముద్రంలో పడిన వెంటనే దాని ఎడమ ఇంజిన్ నుంచి మంటలు రావడం ప్రారంభమైందని స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఇంకా సేకరిస్తున్నామని ఈ ప్రాంతంలోని యుఎస్ ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. జపాన్‌లోని యుఎస్ ఆర్మీ అధికార ప్రతినిధి దీనిపై ఇంకా ఏమీ సమాచారం చెప్పలేదు.
We’re now on WhatsApp. Click to Join.