HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Coalition Government Has Kept Its Promise To Annadata

అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!

రైతుల ఆదాయం పెంచడమే కాకుండా వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది.

  • Author : Gopi Date : 13-03-2026 - 3:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good News
Good News

Kutami Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి ఇది నిజంగా శుభవార్త. ‘సూపర్ సిక్స్’ హామీల్లో భాగంగా రైతులకు ఏడాదికి రూ. 20,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం నేడు ఆ మాటను పూర్తిస్థాయిలో నెరవేర్చింది. మార్చి 13న మూడో విడత నిధుల విడుదలతో రాష్ట్రంలోని లక్షలాది రైతు కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

మూడు విడతల్లో రూ. 20,000 పూర్తి

ప్రధాని నరేంద్ర మోదీ సహకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పంతో అమలవుతున్న ఈ పథకం కింద ఇప్పటికే రెండు విడతల్లో రూ. 14,000 జమ చేసిన ప్రభుత్వం, నేడు మిగిలిన మొత్తాన్ని విడుదల చేసింది.

మొదటి విడత (ఖరీఫ్): ఆగస్టు 2, 2025న రూ. 7,000

రెండో విడత (రబీ): నవంబర్ 19, 2025న రూ. 7,000

మూడో విడత: మార్చి 13న రూ. 6,000 (నేడు జమ అయ్యింది)

దీనితో ఒక్కో రైతు ఖాతాలోకి ఈ ఏడాది మొత్తంగా రూ. 20,000 ఆర్థిక సాయం చేరినట్లయింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతులకు లబ్ధి చేకూరింది.

Also Read: సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు

గతంతో పోలిస్తే భారీ పెరుగుదల

గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఏడాదికి కేవలం రూ. 7,500 మాత్రమే రాష్ట్రం నుండి అందేది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాష్ట్ర వాటాను భారీగా పెంచి రూ. 14,000 అందిస్తోంది. కేంద్రం ఇచ్చే రూ. 6,000 కలిపి ఇప్పుడు రైతన్నకు ఏడాదికి రూ. 6,500 అదనంగా లభిస్తోంది.

ధాన్యం డబ్బులు.. గంటల్లోనే జమ!

రైతుల ఆదాయం పెంచడమే కాకుండా వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది. ఫిబ్రవరి 11 నాటికి 7.31 లక్షల మంది రైతులకు రూ. 10,571 కోట్లు చెల్లించారు. విశేషమేమిటంటే 55% చెల్లింపులు కేవలం 8 గంటల లోపే రైతుల ఖాతాల్లోకి చేరడం ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం.

వ్యవసాయానికి అండగా మరిన్ని చర్యలు

ఆర్థిక సాయంతో పాటు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విత్తనాలకు రూ. 240 కోట్లు, యాంత్రీకరణకు రూ. 219 కోట్లు కేటాయింపు. 6 లక్షల మంది రైతులకు పరీక్షా పత్రాల పంపిణీ. 2026 జూలై నాటికి వెలిగొండ, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వార్షిక ఆర్థిక సాయం హామీని ఉగాది పండుగకు ముందే పూర్తి చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. “అన్నదాత సుఖీభవ” నినాదం ఇప్పుడు నిజమైందని సామాన్య రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap news
  • CM Chandrababu
  • DCM Pawan Kalyan
  • Kutami Govt
  • nara lokesh
  • telugu news

Related News

CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పని తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఉద్యోగులు వినూత్నంగా ఆలోచనలు చేసేలా ప్రోత్

  • Actress Shweta Menon resigns as 'AMMA' President.

    Shweta Menon: ‘అమ్మ’ అధ్యక్ష పదవికి నటి శ్వేతా మీనన్ రాజీనామా

  • ‘Amazon Beautyverse 2026’ event concludes in Mumbai

    Amazon Beautyverse 2026: ముంబైలో ముగిసిన ‘అమెజాన్ బ్యూటీవర్స్ 2026’ ఈవెంట్

  • 'Towing' food app launched in Vijayawada.

    Toing Food Delivery app: విజయవాడలో ‘టోయింగ్’ ఫుడ్ యాప్ ప్రారంభం

  • CM Chandrababu

    CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

Latest News

  • Sleep: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి!

  • Gold Price Today: పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

  • Tirumala School: తిరుమల స్కూల్‌లో విద్యార్థి ఆత్మహత్య.. అసలు నిజం ఇదే..

  • Nara Rohit: నారా వారి ఇంట మ‌రో వార‌సుడు.. మగబిడ్డకు జన్మనిచ్చిన నారా రోహిత్ భార్య శిరీష

  • Kodali Nani: ఏపీ హైకోర్టుకు మాజీ మంత్రి కొడాలి నాని

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd