HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Trump Makes A U Turn Tariffs On European Countries Are Lifted

ట్రంప్ యూటర్న్ యూరోపియన్ దేశాలపై సుంకాల రద్దు.

  • Author : Vamsi Chowdary Korata Date : 22-01-2026 - 11:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Trump Eu Good News
Trump Eu Good News

గ్రీన్‌ల్యాండ్‌ను తమ దేశంలో విలీనం చేసుకునే విషయంలో తీవ్రంగా ప్ర‌య‌త్నించిన‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. గ్రీన్‌ల్యాండ్‌ను తమకు అప్పగించాలంటూ యూరప్ మిత్రదేశాలను బెదిరించిన ఆయన, ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆర్కిటిక్ భద్రతకు సంబంధించి నాటోతో ఒక ‘భవిష్యత్ ఒప్పందానికి మార్గం’ సుగమమైందని, ఈ నేపథ్యంలో యూరప్ దేశాలపై విధించాలనుకున్న టారిఫ్‌లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో నాటో కూటమిలో తలెత్తిన తీవ్ర సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది.

  • అనూహ్యంగా వెనక్కి తగ్గి సుంకాల నిర్ణయాన్ని రద్దు చేసుకున్న ట్రంప్
  • గ్రీన్‌ల్యాండ్ విషయంలో యూరప్ మిత్రదేశాలపై టారిఫ్‌ల బెదిరింపు
  • ఆర్కిటిక్ భద్రతపై నాటోతో కీలక ఒప్పందం కుదిరిందని ప్రకటన
  • గ్రీన్‌ల్యాండ్ సార్వభౌమాధికారంపై వెనక్కి తగ్గేది లేదని డెన్మార్క్ స్పష్టీక‌ర‌ణ‌
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ… గ్రీన్‌ల్యాండ్ “హక్కు, టైటిల్, యాజమాన్యం” తమకు కావాలని, అయితే దాని కోసం సైనిక బలగాలను ఉపయోగించబోమని స్పష్టం చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా వల్లే యూరప్ నిలబడిందని, దశాబ్దాలుగా తాము చేసిన సాయంతో పోలిస్తే గ్రీన్‌ల్యాండ్‌ను అడగటం చాలా చిన్న విషయమని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ మాటలు నాటో కూటమి పునాదులను కదిలించేలా ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది.

ఆర్కిటిక్ మహాసముద్రంలో రష్యా, చైనాల నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కోవాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్‌ల్యాండ్ తమ నియంత్రణలో ఉండటం అత్యవసరమని ట్రంప్ చాలాకాలంగా వాదిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రీన్‌ల్యాండ్‌ను అప్పగించని పక్షంలో డెన్మార్క్‌తో పాటు మరో ఏడు మిత్రదేశాలపై వచ్చే నెల నుంచి 10 శాతం, జూన్ నాటికి 25 శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.

అయితే, డెన్మార్క్ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో మొదటి నుంచి గట్టిగా నిలబడింది. అమెరికా భద్రతాపరమైన ఆందోళనలపై చర్చకు సిద్ధమే కానీ, గ్రీన్‌ల్యాండ్ సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ట్రంప్ బెదిరింపులతో గ్రీన్‌ల్యాండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ, ఐదు రోజులకు సరిపడా ఆహారం, నీరు, ఇంధనం వంటి నిత్యావసరాలను నిల్వ చేసుకోవాలని కోరింది. దీంతో అక్కడి ప్రజలు ఆందోళనతో దుకాణాలకు పరుగులు తీశారు.

తాజా పరిణామాలతో ట్రంప్ టారిఫ్‌ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ, ఆర్కిటిక్ ప్రాంతంపై పట్టు సాధించాలన్న ఆయన వ్యూహం మాత్రం మారలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. నాటోతో కుదిరిన ఫ్రేమ్‌వర్క్ డీల్ స్వరూపంపై స్పష్టత వస్తేనే ఈ వివాదం పూర్తిగా సద్దుమణిగినట్లు భావించాలని వారు అభిప్రాయపడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Arctic region
  • Arctic security
  • denmark
  • Donald Trump
  • donald Trump Greenland
  • Donald Trump Tariffs
  • greenland
  • NATO
  • US Foreign Policy
  • world economic forum

Related News

UK MP furious at Trump, calling him an international bully, not a president

అధ్యక్షుడు కాదు.. అంతర్జాతీయ రౌడీ..ట్రంప్ పై మండిపడ్డ యూకే ఎంపీ

గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ అవలంబిస్తున్న విధానాన్ని ఆయన కఠినంగా తప్పుబట్టారు. ట్రంప్ అంతర్జాతీయ రాజకీయాలకు నాయకత్వం వహించాల్సిన అధ్యక్షుడిలా కాకుండా బలప్రయోగంతో తనకు కావలసినదాన్ని సాధించాలనుకునే గ్యాంగ్‌స్టర్‌లా వ్యవహరిస్తున్నారని డేవీ ఆరోపించారు.

  • Katy Perry And Justin Trudeau

    దావోస్ సదస్సులో ప్రేమాయణం… కెమెరాకు చిక్కిన ట్రూడో, కేటీ పెర్రీల రొమాంటిక్ కపుల్

  • Chiranjeevi Revanth Reddy Davos

    ప్రపంచ ఆర్థిక సదస్సు దావోస్‌లో రేవంత్ రెడ్డితో చిరంజీవి

  • Air Force One Electrical Issue

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

  • US Treasury Secretary on India

    అమెరికా ట్రెజరీ సెక్రటరీ కీలక ప్రకటన.. భారత్‌పై 500 శాతం టారిఫ్ విధించే అవకాశం..?

Latest News

  • మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను గెలిపించే బాధ్యత వారిదే – కేసీఆర్

  • విజయవాడలో హోంమంత్రి అనితను కలిసిన కానిస్టేబుల్‌ జయశాంతి

  • మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ కు సవాల్ విసిరిన మంత్రి కోమటిరెడ్డి

  • మీ ద‌గ్గ‌ర రూ. 2000 నోట్లు ఉన్నాయా? అయితే ఇలా ఉప‌యోగించండి!

  • వామ్మో అనంత్ అంబానీ వాచ్ ధర తెలిస్తే గుండెలు బాదుకుంటారు !!

Trending News

    • 77వ గణతంత్ర దినోత్సవ వేడుక‌లు.. నేరస్తులను గుర్తించేందుకు స్మార్ట్ గ్లాసెస్?!

    • పాదయాత్ర పై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్

    • వాట్సాప్ వినియోగ‌దారుల‌కు మ‌రో గుడ్ న్యూస్‌.. జూమ్‌, గూగుల్ మీట్‌కు గ‌ట్టి పోటీ?!

    • మీ భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న‌లో ఈ మార్పులు గ‌మ‌నిస్తున్నారా?

    • దేశంలో మ‌రోసారి నోట్ల ర‌ద్దు.. ఈసారి రూ. 500 వంతు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd