ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?
అమెరికా- ఇరాన్ మధ్య పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు.
- Author : Gopi
Date : 18-04-2026 - 9:58 IST
Published By : Hashtagu Telugu Desk
Trump Next Target: అమెరికా- ఇరాన్ మధ్య పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. తన తదుపరి లక్ష్యం ఏమిటో ట్రంప్ స్పష్టం చేశారు. క్యూబానే తన తదుపరి లక్ష్యమని, త్వరలోనే అక్కడ కొత్త ఉదయం (కొత్త శకం) మొదలుకాబోతోందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు దాదాపు 10 యుద్ధాలను ఆపినట్లు క్లెయిమ్ చేసుకున్న ట్రంప్ ఆ తర్వాత ఈ ప్రకటన చేయడం గమనార్హం.
అమెరికాలో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ ట్రంప్ ఇలా అన్నారు. క్యూబా ప్రజలు గత 70 ఏళ్లుగా అమెరికా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మేము వారికి సహాయం చేస్తాము. ఇకపై ఏం జరుగుతుందో చూడండి అని ట్రంప్ పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే అమెరికా త్వరలోనే క్యూబాలో సైనిక పరంగా జోక్యం చేసుకోబోతోందని స్పష్టమవుతోంది.
Also Read: భారత్కు ‘గుడ్ న్యూస్’.. హోర్ముజ్ జలసంధి ఓపెన్!
మరోవైపు ఇరాన్ యుద్ధంపై ట్రంప్ వరుసగా 7 సోషల్ మీడియా పోస్ట్లు చేశారు. ఇందులో అనేక విషయాలతో పాటు హోర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని, అయితే ఒప్పందం కుదిరే వరకు అమెరికా తన దిగ్బంధనాన్ని తొలగించదని ఆయన పేర్కొన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడి వాదనలను ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ గాలిబాఫ్ పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు. దిగ్బంధనం కొనసాగుతున్నంత కాలం హోర్ముజ్ జలసంధిని తెరవబోమని గాలిబాఫ్ స్పష్టం చేశారు. ఒకవేళ భవిష్యత్తులో హోర్ముజ్ తెరిచినా షిప్పింగ్ కేవలం ఇరాన్ నిర్దేశించిన మార్గాల్లో, ఇరాన్ అనుమతితో మాత్రమే సాధ్యమవుతుందని ఆయన తేల్చి చెప్పారు.