Syria: సిరియాపై ఇజ్రాయెల్ దాడులు.. ముగ్గురు మృతి
సిరియా (Syria)లోని అలెప్పో విమానాశ్రయంపై ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో సిరియాకు చెందిన ముగ్గురు పౌరులు మరణించారని సిరియా అధికారికంగా ప్రకటించింది. దీంతో భూకంప సహాయక విమానాలు పూర్తిగా నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.
- By Gopichand Published Date - 09:14 AM, Wed - 8 March 23

సిరియా (Syria)లోని అలెప్పో విమానాశ్రయంపై ఇజ్రాయెల్ మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో సిరియాకు చెందిన ముగ్గురు పౌరులు మరణించారని సిరియా అధికారికంగా ప్రకటించింది. దీంతో భూకంప సహాయక విమానాలు పూర్తిగా నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. అయితే టర్కీ, సిరియాలను ఇటీవల భూకంపం కుదిపేసిన సమయంలో సహాయక చర్యలకు ఈ విమానాశ్రయమే ప్రధాన మార్గంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ తన అలెప్పో ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు సిరియా తెలిపింది. దీంతో విమానాశ్రయానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు అన్ని సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. మీడియా నివేదికల ప్రకారం.. ఇజ్రాయెల్ లటాకియాకు పశ్చిమాన మధ్యధరా సముద్రం నుండి అలెప్పో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడిని ప్రారంభించింది. దీంతో విమానాశ్రయానికి చాలా నష్టం వాటిల్లింది.
Also Read: Earthquake in Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌ను వణికించిన భూకంపం.. 4.2 తీవ్రతగా నమోదు
ఈ దాడిలో ముగ్గురు పౌరులు మరణించినట్లు సమాచారం. అదే సమయంలోఇజ్రాయెల్ అధికారులు ఈ విషయంపై ఇంకా వ్యాఖ్యానించలేదు. గత నెలలో టర్కీ, సిరియాలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో తీవ్రంగా దెబ్బతిన్నది. ఫిబ్రవరి 19న సిరియా రాజధాని డమాస్కస్ నివాస ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం ఐదుగురు మరణించారు. 15 మంది గాయపడ్డారు.

Related News

Chocolate Factory Explosion: చాక్లెట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి.. 9 మంది గల్లంతు.!
అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రావిన్స్‌లో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీలో శుక్రవారం పేలుడు (Chocolate Factory Explosion) సంభవించింది. ఈ పేలుడులో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.