HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Shahabuddin Chuppu Elected As Bangladeshs New President

Shahabuddin Chuppu: బంగ్లాదేశ్‌ నూతన అధ్యక్షుడిగా చుప్పూ ఎన్నిక

బంగ్లాదేశ్ ప్రధాన ఎన్నికల సంఘం దేశ 22వ అధ్యక్షుడి పేరును ప్రకటించింది. బంగ్లాదేశ్‌ కొత్త అధ్యక్షుడిగా మాజీ న్యాయమూర్తి, స్వాతంత్య్ర సమరయోధుడు మహ్మద్‌ షహబుద్దీన్‌ చుప్పూ (Shahabuddin Chuppu)ని నియమిస్తారని కమిషన్‌ వెల్లడించింది. సోమవారం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

  • Author : Gopi Date : 15-02-2023 - 8:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BANGLADESH
Resizeimagesize (1280 X 720) (1) 11zon

బంగ్లాదేశ్ ప్రధాన ఎన్నికల సంఘం దేశ 22వ అధ్యక్షుడి పేరును ప్రకటించింది. బంగ్లాదేశ్‌ కొత్త అధ్యక్షుడిగా మాజీ న్యాయమూర్తి, స్వాతంత్య్ర సమరయోధుడు మహ్మద్‌ షహబుద్దీన్‌ చుప్పూ (Shahabuddin Chuppu)ని నియమిస్తారని కమిషన్‌ వెల్లడించింది. సోమవారం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కాజీ హబీబుల్ అవల్ ఆదివారం సమర్పించిన నామినేషన్ పత్రాలను పరిశీలించిన తర్వాత అతని పేరును ప్రకటించారు.

అతను ప్రస్తుతం అవామీ లీగ్ సలహా మండలి సభ్యుడు. ఇప్పుడు అతను పార్టీలో తన పదవులను వదిలివేయవలసి ఉంటుంది. ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యర్థి అభ్యర్థి లేకపోవడంతో ఆయన అధ్యక్షుడు కావడం ఇప్పటికే ఫిక్సయిపోయింది. బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షుడి నియామకానికి సంబంధించిన గెజిట్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్ సోమవారం విడుదల చేశారు. చుప్పూ బంగ్లాదేశ్ 22వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బంగ్లాదేశ్‌లో సుదీర్ఘకాలంపాటు పనిచేసిన అబ్దుల్ హమీద్ పదవీకాలం ఏప్రిల్ 23తో ముగుస్తుంది. బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం.. ఏ వ్యక్తి అయినా దేశానికి రెండుసార్లు మాత్రమే రాష్ట్రపతి కాగలడు. కాగా, ప్రస్తుత అధ్యక్షుడు హమీద్‌ నూతనంగా ఎన్నికైన రాష్ట్రపతికి సోమవారం నాడు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలియజేశారు.

అంతకుముందు, పార్లమెంటులో పూర్తి మెజారిటీ ఉన్న అవామీ లీగ్ పార్టీ, షహబుద్దీన్ చుప్పూను ఉన్నత పదవికి నామినేట్ చేసింది. అదే సమయంలో పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ దేశంలోని అత్యున్నత పదవికి ఎవరినీ నామినేట్ చేయలేదు. ప్రస్తుత అధ్యక్షుడు మహ్మద్‌ అబ్దుల్‌ హమీద్‌ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్‌ 24తో ముగియడం గమనార్హం. 350 మంది సభ్యులున్న సభలో ప్రస్తుతం అవామీ లీగ్‌కు 305 సీట్లు ఉన్నాయి. ఈ మెజారిటీ దృష్ట్యా అధ్యక్షుడిగా మహ్మద్ షహబుద్దీన్ చుప్పూ ఎన్నిక ఖరారైంది.

Also Read: Hawaii: వామ్మో.. చావు అంచుకు తీసుకెళ్లిన విమానం… రెప్పపాటులో ఎగిరి!?

మహ్మద్ షహబుద్దీన్ చుప్పూ వాయువ్య పాబ్నా జిల్లాలో జన్మించాడు. అతను 1960ల చివరలో, 1970ల ప్రారంభంలో అవామీ లీగ్ విద్యార్థి, యువజన విభాగానికి నాయకుడు. ఇది మాత్రమే కాదు చప్పు 1971 విముక్తి యుద్ధంలో కూడా పాల్గొని బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు వ్యతిరేకంగా అతని కుటుంబ సభ్యులతో కలిసి ఆగస్టు 15, 1975న సైనిక తిరుగుబాటులో నిరసన తెలిపి జైలు పాలయ్యాడు. ఆ తిరుగుబాటు కారణంగా అవామీ లీగ్ ప్రభుత్వం కూడా పడిపోయింది. తర్వాత 1982లో దేశ న్యాయ సేవలో చేరారు.

తరువాత, 1996 ఎన్నికలలో అవామీ లీగ్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు చుప్పూ బంగాబంధు హత్య దర్యాప్తు బృందానికి సమన్వయకర్తగా పనిచేశాడు. తర్వాత రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. రాజకీయాల్లో చేరిన తర్వాత అవామీ లీగ్ అడ్వైజరీ కౌన్సిల్‌లో సభ్యుడయ్యాడు. ఇప్పుడు దేశానికి అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీలో తన బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. మాజీ న్యాయమూర్తి మహ్మద్ షహబుద్దీన్ చుప్పూకు భార్య రెబెక్కా, ఒక కుమారుడు ఉన్నారు. భార్య రెబెక్కా సుల్తానా ప్రభుత్వ మాజీ సంయుక్త కార్యదర్శి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bangladesh
  • Bangladesh New President
  • Shahabuddin Chuppu
  • world news

Related News

Iran

సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని మెచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే సంతకం చేయడానికి తానే స్వయంగా ఇస్లామాబాద్ వస్తానని ఒక పెద్ద ప్రకటన చేశారు.

  • Donald Trump

    సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌!

  • Ceasefire

    గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

  • Iran

    ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

  • Trump Next Target

    ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?

Latest News

  • DJ టిల్లు తో వెంకీ వెబ్ సిరీస్!

  • Big Shock : తెలంగాణ సర్కార్ కు మరో షాక్..

  • రానా- అక్షయ్ కుమార్ కాంబోలో భారీ బ‌డ్జెట్ మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

  • పాఠశాలల్లో వాటర్ బెల్

  • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

Trending News

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

    • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd