Train Hijack : పాక్‌లో రైలు హైజాక్.. వేర్పాటువాదుల అదుపులో వందలాది మంది
2000 సంవత్సరం ప్రారంభం నుంచి పాక్ సైన్యంపై బీఎల్ఏ(Train Hijack) దాడులకు పాల్పడుతోంది.
- By Pasha Published Date - 06:24 PM, Tue - 11 March 25

Train Hijack : ఉగ్రవాదుల నిలయంగా మారిన పాకిస్తాన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బెలూచిస్తాన్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉన్న పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును బెలూచిస్తాన్ వేర్పాటువాదులు హైజాక్ చేశారు. మార్గం మధ్యలో ఉన్న ఒక రైల్వేట్రాక్‌ను వారు తొలుత పేల్చేశారు. దీన్ని గమనించి కొంత దూరంలో రైలును ఆపగానే, దానిలోకి చొరబడి హైజాక్ చేశారు. ఈక్రమంలో రైలులో భారీ కాల్పులు జరిపారు. ప్రతిఘటించిన వారిపై దాడికి పాల్పడ్డారు. వందలాది మంది ప్రయాణికులు ఉన్న బోగీలను తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు.
Also Read :Hindu Mutton Shops: హిందువుల మటన్ షాపులకు ‘మల్హర్ సర్టిఫికేషన్’.. ఏమిటిది ?
మాదే బాధ్యత : బెలూచ్ లిబరేషన్ ఆర్మీ
ఈ హైజాక్‌కు బాధ్యత తమదేనని బెలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. తాము బందీలుగా తీసుకున్నవారిలో పాకిస్తాన్ భద్రతాసిబ్బంది కూడా ఉన్నారని తెలిపింది. తమ కాల్పుల్లో ఆరుగురు పాక్ మిలిటరీ సిబ్బంది చనిపోయారని బీఎల్‌ఏ వెల్లడించింది. తమపై ఏదైనా మిలిటరీ ఆపరేషన్‌కు ప్రయత్నిస్తే, ప్రయాణికులందరినీ చంపేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ ఘటనలో రైలు డ్రైవర్ గాయపడినట్లు సమాచారం. అత్యవసర చర్యలు తీసుకోవాలంటూ స్థానిక అధికార యంత్రాంగాన్ని బెలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రభుత్వం ఆదేశించింది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలులోని బందీలను విడిపించేందుకు పాక్ భద్రతా బలగాలు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నాయి.
Also Read :Dalai Lama Vs China: భారత్‌లో నా వారసుడు.. దలైలామా ప్రకటన.. చైనా భగ్గు
ఏమిటీ బెలూచిస్తాన్ వేర్పాటువాదం ?
- బెలూచిస్తాన్ ప్రాంతం నైరుతి పాకిస్తాన్, ఆగ్నేయ ఇరాన్, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లలో వ్యాపించి ఉంది.
- చైనా చేపట్టిన చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సిపెక్) బెలూచిస్తాన్ మీదుగా వెళ్తోంది. దీన్ని బెలూచిస్తాన్ వేర్పాటువాదులు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల బెలూచిస్తాన్ ఆర్థిక వృద్ధి జరుగుతుందని పాక్ సర్కారు అంటోంది. తమ ప్రాంత వనరులను చైనా కొల్లగొడుతుందని వేర్పాటువాదులు అంటున్నారు.
- బెలూచిస్తాన్ వేర్పాటువాదులపై పాక్ సర్కారు కఠిన చర్యలు తీసుకుంటోంది. దీంతో పరిస్థితులు మరింత జటిలంగా మారుతున్నాయి.
- బెలూచిస్తాన్ ప్రజల కోసం పాకిస్తాన్ నుంచి ప్రత్యేక ప్రాంత ఆవిర్భావాన్ని బెలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) కోరుతోంది.
- 2000 సంవత్సరం ప్రారంభం నుంచి పాక్ సైన్యంపై బీఎల్ఏ(Train Hijack) దాడులకు పాల్పడుతోంది.
- పాక్‌తో పాటు అమెరికా, యూకేలు బీఎల్ఏను ఉగ్ర సంస్థగా ప్రకటించాయి.