HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Dalai Lama Says Successor Will Be Born Outside Of China Beijings Reaction Is Here

Dalai Lama Vs China: భారత్‌లో నా వారసుడు.. దలైలామా ప్రకటన.. చైనా భగ్గు

దలైలామా(Dalai Lama Vs China) అనేది టిబెటన్‌ బౌద్ధుల అత్యున్నత స్థాయి ఆధ్యాత్మిక గురువు హోదా.

  • By Pasha Published Date - 03:56 PM, Tue - 11 March 25
  • daily-hunt
Dalai Lamas Successor Vs China Tibet

Dalai Lama Vs China: టిబెట్‌ బౌద్ధ గురువు దలైలామా కీలక ప్రకటన చేశారు. చైనా బయటే తన వారసుడు జన్మిస్తాడని ఆయన వెల్లడించారు. తన తర్వాత కూడా దలైలామా వారసత్వం కొనసాగాలన్నారు. ‘‘పూర్వీకుల పనిని ముందుకు తీసుకెళ్లటానికి ఉద్దేశించిందే పునర్జన్మ. కొత్త దలైలామా చైనా బయట స్వేచ్ఛా ప్రపంచంలో జన్మిస్తాడు. విశ్వకరుణ కోసం అతడు గళం వినిపిస్తాడు’’ అని దలైలామా పేర్కొన్నారు.  ‘‘నా పునర్జన్మ టిబెట్‌ బయట జరగొచ్చు. అది భారత్‌లో కూడా కావచ్చు’’ అని ఆయన తెలపడం గమనార్హం. తన వారసుడిగా చైనా ప్రకటించే వ్యక్తికి ఎటువంటి గౌరవం లభించదని స్పష్టం చేశారు. తన కొత్త పుస్తకం  ‘వాయిస్‌ ఫర్‌ ది వాయిస్‌లెస్‌’లో ఈవివరాలను దలైలామా ప్రస్తావించారు. దలైలామా ప్రస్తుతం భారత్‌లోని హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఆయన అక్కడి నుంచే తన వారసుడిని ఎంపిక చేయనున్నారు.

Also Read :Pranay Murder Case : ప్రణయ్ హత్య కేసు.. ఉరిశిక్ష పడిన సుభాష్‌శర్మ వివరాలివీ

ప్రస్తుత దలైలామా గురించి.. 

  • దలైలామా(Dalai Lama Vs China) అనేది టిబెటన్‌ బౌద్ధుల అత్యున్నత స్థాయి ఆధ్యాత్మిక గురువు హోదా.
  • ప్రస్తుతం 14వ దలైలామాగా.. టిబెట్‌కు చెందిన టెంజియన్‌ గ్యాట్సో వ్యవహరిస్తున్నారు.
  • ప్రస్తుత దలైలామా (టెంజియన్‌ గ్యాట్సో)  23వ ఏటే టిబెట్‌ నుంచి భారత్‌కు వలస వచ్చారు. తమ ప్రాంతాన్ని చైనా ఆక్రమించడాన్ని ఆయన తప్పుపట్టారు. దలైలామాకు 1989లో నోబెల్‌ శాంతి బహుమతి వచ్చింది.
  • దలైలామా భారత్‌లోని ధర్మశాలలో ఉండటం చైనాకు గిట్టడం లేదు.  చైనా గడ్డపై నుంచే వారసుడి గురించి ప్రకటన చేయాలని దలైలామాను డిమాండ్ చేస్తోంది.
  • టిబెటన్‌ బౌద్ధుల దృష్టిలో దలైలామా తర్వాతి స్థానం పాంచెన్‌ లామాది. ఈ పదవికి దలైలామా ఎంపిక చేసిన బాలుడిని చైనా తిరస్కరించింది. తానే మరో బాలుడిని నియమించింది. అయితే అతడికి టిబెటన్ల ఆమోదం లభించలేదు.
  • ఈ నేపథ్యంలో ఇప్పుడు తన వారసుడి ఎంపికపై దలైలామా కసరత్తును వేగవంతం చేయడం గమనార్హం.

Also Read :X Cyber Attack: ‘ఎక్స్‌’పై సైబర్ ఎటాక్.. ‘డార్క్ స్టార్మ్’ పనా ? ‘ఉక్రెయిన్’ పనా ?

చైనా రియాక్షన్ 

దలైలామా వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ భగ్గుమంది. ‘‘మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కుట్రలకు దలైలామా తెర తీస్తున్నారు.  మరో దేశం (భారత్)లో పునరావాసం పొందిన దలైలామా, చైనా వ్యతిరేక చేష్టల్లో భాగం అవుతున్నారు.  దలైలామా వ్యాఖ్యల వల్ల టిబెట్ విషయంలో చైనా వైఖరిలో మార్పు రాదు. తదుపరి దలైలామా ఎంపిక అనేది చైనా పరిధిలోని అంశం. మేమే నిర్ణయం తీసుకుంటాం’’ అని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Beijing
  • china
  • Dalai Lama
  • Dalai Lama Vs China
  • Dalai Lamas Successor
  • india
  • tibet

Related News

Pak Hackers

Hackers : ఇండియా ను టార్గెట్ చేసిన పాక్ హ్యాకర్స్!

Hackers : దేశ భద్రతకు సంబంధించిన కీలక వ్యవస్థలపై సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో, భారత నిఘా సంస్థలు పాకిస్తాన్‌తో సంబంధమున్న హ్యాకర్ గ్రూప్‌ “ట్రాన్స్పరెంట్ ట్రైబ్” (Transparent Tribe) నుంచి వచ్చే కొత్త ముప్పుపై అప్రమత్తం చేశాయి

  • Vande Mataram

    Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

  • Rangareddy

    Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

  • Stampede Incidents Kashibug

    2025 Stampede incidents In India: తొక్కిసలాట ఘటనల్లో 114 మంది ప్రాణాలు

Latest News

  • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

  • MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోని ఆడ‌నున్నాడా? క్లారిటీ ఇదే!

  • Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో గందరగోళం

  • Alcohol Sales : మద్యం అమ్మకాల్లో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు

  • Peddi Chikiri Chikiri Song : పుష్ప 2 సాంగ్ రికార్డు ను బ్రేక్ చేసిన ‘పెద్ది’ సాంగ్

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd