Mpox in Pakistan: పాక్‌లో చాపకింద నీరులా విస్తరిస్తోన్న మంకీపాక్స్
Mpox in Pakistan: పాక్‌లో మంకీపాక్స్ భారీన పడిన వ్యక్తిని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అక్కడ అతనిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఐదవ మంకీపాక్స్ కేసు నమోదైంది.
- By Praveen Aluthuru Published Date - 11:22 AM, Sun - 15 September 24

Mpox in Pakistan: పాక్‌లో మంకీపాక్స్ ఆందోళన కలిగిస్తుంది. తాజాగా మరో కేసు వెలుగులోకి రావడంతో అక్కడ కలకలం రేగింది. కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని అధికారులు శనివారం అనుమానిత కేసును నివేదించారు. ఓ వ్యక్తి సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్ (Pakistan) కు వచ్చాడు.
మంకీపాక్స్ (Mpox) భారీన పడిన వ్యక్తిని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అక్కడ అతనిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఐదవ మంకీపాక్స్ కేసు నమోదైంది. 33 ఏళ్ల బాధితుడు ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్ నివాసి అని ఒక అధికారి తెలిపారు.సెప్టెంబరు 7న సౌదీ అరేబియా నుంచి పాకిస్థాన్‌కు వచ్చిన తర్వాత అతనికి మంకీపాక్స్ సోకిందని ఖైబర్ టీచింగ్ హాస్పిటల్ ధృవీకరించిందని అధికారి తెలిపారు.మునుపెన్నడూ లేనివిధంగా మంకీపాక్స్ వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అత్యవసర హెచ్చరికను పంపింది. మంకీపాక్స్ ప్రపంచంలోని అనేక దేశాల్లో విధ్వంసం సృష్టించింది. మంకీ పాక్స్‌ని ఎంఫాక్స్ (Mpox) అని కూడా పిలుస్తారు.
భారతదేశంలో కూడా మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదైంది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించిన సమాచారాన్ని అన్ని రాష్ట్రాలతో పంచుకుంది. అదే సమయంలో అనుమానిత రోగులను గుర్తించి ఐసోలేషన్ లో పెట్టాలని ఆదేశించింది.మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎంఫాక్స్ కోసం మొదటి వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టీకా పెద్దలకు ఉంటుంది. ఈ వ్యాక్సిన్ బవేరియన్ నార్డిక్ కంపెనీకి చెందినది. ప్రస్తుతం దాని సరఫరా పరిమితంగా ఉంటుంది. కానీ UNICEF వంటి సంస్థలు దానిని కొనుగోలు చేయగలవు.
Also Read: TPCC Oath Ceremony: పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్ హాజరయ్యే అవకాశం