TPCC Oath Ceremony: పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్ హాజరయ్యే అవకాశం
TPCC Oath Ceremony: ఆదివారం అంగరంగ వైభవంగా జరగనున్న పీసీసీ నూతన చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీభవన్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయం ముస్తాబైంది. రేవంత్ రెడ్డి తన వారసుడికి మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు అప్పగించనున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 15-09-2024 - 10:50 IST
Published By : Hashtagu Telugu Desk
TPCC Oath Ceremony: తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. రెండ్రోజులుగా కౌశిక్ రెడ్డి వర్సెస్ అరెకపూడి గాంధీ మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి. ఇరు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుంది. ఓ వైపు రాష్ట్రంలో పొలిటికల్ వార్ నడుస్తుండగా ఈ రోజు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ (Mahesh Kumar Goud) బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది.
ఆదివారం అంగరంగ వైభవంగా జరగనున్న పీసీసీ నూతన చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీభవన్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయం ముస్తాబైంది. రేవంత్ రెడ్డి (Revanth Reddy) తన వారసుడికి మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు అప్పగించనున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈ కార్యక్రమానికి మంత్రులతో సహా దాదాపు 5,000 నుండి 6,000 మంది పార్టీ నాయకులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కొందరు ఏఐసీసీ నేతలతో సహా 60 మంది ముఖ్య నేతలకు సరిపోయేలా భారీ వేదికను సిద్ధం చేశారు. కార్యకర్తల కోసం గాంధీ విగ్రహం దగ్గర రోడ్డు పక్కన పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుక మధ్యాహ్నం 12 గంటలకు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించిన తర్వాత ప్రారంభమవుతుంది. ఆ తర్వాత గాంధీ భవన్ వరకు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించి, మహేశ్‌కు మద్దతు తెలుపుతూ వందలాది మంది పార్టీ సభ్యులు ఆయనతో పాటు వేదిక వరకు నడుస్తారు.
కాసేపట్లో సీఎం, ఇతర మంత్రులతో కలిసి ఆయన కార్యక్రమ స్థలానికి చేరుకుంటారు. గత మూడేళ్ళలో రాష్ట్ర నాయకత్వం ఎలా మార్పు తీసుకురాగలిగిందో రేవంత్ రెడ్డి గుర్తుచేసుకునే అవకాశం ఉంది. ఈ అధ్యక్ష మార్పు రాబోయే స్థానిక సంస్థలతో పాటు రాబోయే ఇతర ఎన్నికలలో విజయం సాధించేలా పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరుస్తుంది. ఇదిలావుండగా ఈ ప్రధాన కార్యక్రమం నేపథ్యంలో నగర పోలీసులు భద్రత మరియు ట్రాఫిక్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్షా సమావేశంలో అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారుభద్రతా ఏర్పాట్లలో భాగంగా గాంధీభవన్‌లో వీవీఐపీలకు ప్రత్యేక ప్రవేశం కల్పిస్తున్నారు.
Also Read: Nitin Gadkari PM Offer: నితిన్ గడ్కరీకి ప్రధానమంత్రి పదవి ఆఫర్