Netanyahu : గాజాలో ‘హమస్థాన్’ ఏర్పాటు కానివ్వబోం
Netanyahu : గాజాలో హమాస్ ఉనికిని పూర్తిగా చెరిపివేయడమే తమ తుది లక్ష్యమని, ఈ విషయంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గబోదని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తేల్చిచెప్పారు.
- Author : Kavya Krishna
Date : 03-07-2025 - 5:11 IST
Published By : Hashtagu Telugu Desk
Netanyahu : గాజాలో హమాస్ ఉనికిని పూర్తిగా చెరిపివేయడమే తమ తుది లక్ష్యమని, ఈ విషయంలో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గబోదని ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తేల్చిచెప్పారు. కాల్పుల విరమణపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “గాజాలో ఇకపై హమాస్ ఉండదు, హమస్థాన్‌గా మారదు. వారిని పూర్తిగా తుడిచిపెట్టేస్తాం” అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు ఇటీవల గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు కొనసాగుతున్న సమయంలో ఇజ్రాయెల్ వైఖరి గమనించదగినది.
CM Chandrababu : తెలంగాణ ప్రాజెక్టులను ఎప్పుడూ వ్యతిరేకించలేదు – చంద్రబాబు
ఇదే సమయంలో, కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ ప్రకటించింది. అయితే, గాజాపై యుద్ధాన్ని పూర్తిగా ఆపి, ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి వెళ్లాలని స్పష్టం చేస్తూ, అప్పుడు బందీలుగా ఉన్న మిగిలిన 50 మందిని విడుదల చేస్తామని తెలిపింది. హమాస్ ఈ ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. హమాస్ తమ ఆయుధాలు వదలాలి, పాలస్తీనా నుంచి బయటకు వెళ్లాలి అనే షరతులతోనే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని తెలిపింది. యుద్ధాంతంలో గాజాలో హమాస్ ఉనికి ఉండదని నెతన్యాహు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
MLC Kavitha : 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు వద్దు : ఎమ్మెల్సీ కవిత