CM Chandrababu : తెలంగాణ ప్రాజెక్టులను ఎప్పుడూ వ్యతిరేకించలేదు – చంద్రబాబు
CM Chandrababu : తెలంగాణ ప్రాజెక్టులను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, ఇకపై కూడా వ్యతిరేకించబోనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ నీటి సమస్యలు పరిష్కారమైతే తెలుగువారి భవిష్యత్తు మెరుగవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు
- By Sudheer Published Date - 02:21 PM, Thu - 3 July 25

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)పై స్పష్టతనిచ్చారు. ఈ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం జరగదని ఆయన పునరుద్ఘాటించారు. కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా గురువారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన (CM Chandrababu).. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని వినియోగించుకుని రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. గోదావరిపై లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమన్న నమ్మకంతో తానే దేవాదుల ప్రాజెక్టుకు పునాది వేసినట్టు గుర్తు చేశారు. వందేళ్లుగా సగటున 2వేల టీఎంసీలు నీరు సముద్రంలోకి పోతున్నాయన్న చంద్రబాబు, ఆ నీటిని సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు గణనీయంగా లాభపడతాయని తెలిపారు.
MLC Kavitha : 42 శాతం బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక ఎన్నికలు వద్దు : ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ ప్రాజెక్టులను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, ఇకపై కూడా వ్యతిరేకించబోనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ నీటి సమస్యలు పరిష్కారమైతే తెలుగువారి భవిష్యత్తు మెరుగవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్రంలోని తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తప్పుడు ప్రచారాలు, రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న విమర్శలను ఖండించిన ఆయన, తాను ఎప్పుడూ నిజాయితీగా పనిచేశానని తెలిపారు. ప్రజల కోసం పనిచేస్తున్న తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నీతిమాలిన వ్యక్తులకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలను ఆదుకోవడంలో తమ ప్రభుత్వం ముందుందని, అన్ని విధాలుగా రైతులకు మద్దతుగా నిలుస్తున్నామని తెలిపారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇచ్చే విధంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. అనర్హులకు పెన్షన్ రద్దు చేయడం రాజకీయం కాదని, అందులో వైసీపీ నేతలు అర్ధం లేని ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు. దోచుకునే వాళ్లు ఇచ్చే వాళ్లపై విమర్శలు చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. తప్పుడు పనులు తాత్కాలికం, కానీ మంచి పనులు శాశ్వతంగా మిగిలిపోతాయని గుర్తు చేశారు.