Meta CEO Zuckerberg: మెటా సీఈవో జుకర్‌బర్గ్ శాలరీ ఎంతో తెలుసా..? రూ. 100 కంటే తక్కువే..!
మార్క్ జుకర్‌బర్గ్ 2023 సంవత్సరంలో కేవలం 1 డాలర్ (83 రూపాయలు) మాత్రమే ప్రాథమిక వేతనంగా తీసుకున్నాడు. మార్క్ ఈ జీతం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
- Author : Gopichand
Date : 28-04-2024 - 11:34 IST
Published By : Hashtagu Telugu Desk
Meta CEO Zuckerberg: మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ (Meta CEO Zuckerberg) మరోసారి వార్తల్లోకి నిలిచారు. ఈసారి వాట్సాప్ గురించి కాకుండా తన జీతం, ఖర్చుల గురించి వార్తల్లోకి వచ్చారు. వాట్సాప్‌తో సహా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మాతృ సంస్థ మెటా. ఈ రోజుల్లో భారతదేశంలో వాట్సాప్ పనితీరుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి మెటా కంపెనీకి మధ్య సమస్యలు ఏర్పడ్డాయి. మరోవైపు మార్క్ జీతం, అతని ఖర్చుల గురించి ఒక నివేదిక బయటికొచ్చింది.
ప్రాథమిక వేతనం రూ.83 మాత్రమే
ఫార్చ్యూన్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. మార్క్ జుకర్‌బర్గ్ 2023 సంవత్సరంలో కేవలం 1 డాలర్ (83 రూపాయలు) మాత్రమే ప్రాథమిక వేతనంగా తీసుకున్నాడు. మార్క్ ఈ జీతం తెలిసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ కాలంలో అతను ‘ఇతర మార్గాల’ ద్వారా 24.4 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 20 కోట్లు) అందుకున్నాడు. ఇతర పద్ధతులలో అలవెన్సులు ఉంటాయి. ఈ సమయంలో అతని భద్రత కోసం కూడా చాలా డబ్బు ఖర్చు చేయబడింది.
Also Read: GT vs RCB: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్.. గిల్ జట్టుకు డూ ఆర్ డై మ్యాచ్..!
భద్రతకు రూ.245 కోట్లు ఖర్చు
2023 సంవత్సరంలో జుకర్‌బర్గ్ భద్రత కోసం సుమారు రూ. 245 కోట్లు ఖర్చు చేశారు. అంతకముందు తన భద్రత కోసం రూ.323 కోట్లు వెచ్చించారు. మార్క్ ప్రీ-టాక్స్ అలవెన్స్ గురించి మాట్లాడినట్లయితే.. అది 40 శాతం పెరిగి $ 14 మిలియన్లకు (సుమారు రూ. 320 కోట్లు) చేరుకుంది. తన ప్రైవేట్ విమానాల వినియోగానికి సంబంధించిన మొత్తాన్ని కూడా పెంచారు.
We’re now on WhatsApp : Click to Join
జీతంలో అవకతవకలు!
మార్క్ కి వచ్చే మూల వేతనం నామమాత్రమే. వాస్తవానికి మార్క్ జీతంలో ఎక్కువ భాగం అతని భద్రత, అలవెన్సులుగా నమోదు చేయబడింది. గత కొన్ని సంవత్సరాలుగా మార్క్ ప్రాథమిక జీతం ఒక డాలర్. మార్క్‌కి ఇంత సంపద రావడానికి కారణం ప్రోత్సాహకాలతో పాటు కంపెనీ నుంచి ఇతర నష్టపరిహారం, షేర్ల రూపంలో డబ్బు పొందడమే.
ప్రపంచంలో నాల్గవ ధనవంతుడు
ఇటీవలి ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. మార్క్ ప్రపంచంలోని నాల్గవ సంపన్న వ్యక్తి. మార్క్ సంపద దాదాపు 190 బిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్. ఆయన తర్వాత అమెజాన్‌కు చెందిన జెఫ్ బోజెస్, టెస్లాకు చెందిన ఎలోన్ మస్క్ ఉన్నారు.