Imran Khan: ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? 3 వారాలుగా కుటుంబానికి నో ఎంట్రీ!
ప్రభుత్వం అదనపు భద్రతా బలగాలను మోహరించినప్పటికీ చర్చల తర్వాత ధర్నా ముగిసింది. ఖాన్ సోదరీమణులు పంజాబ్ పోలీసు చీఫ్ ఉస్మాన్ అన్వర్‌కు లేఖ రాసి దీనిని "వ్యవస్థీకృత హింస"గా పేర్కొంటూ "నిష్పక్షపాత విచారణ"కు డిమాండ్ చేశారు.
- By Gopichand Published Date - 05:28 PM, Wed - 26 November 25
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను మూడు వారాలుగా కుటుంబ సభ్యులు, సన్నిహితులను కలవడానికి అనుమతించడం లేదు. అతని గురించి ఎలాంటి సమాచారం కూడా లభించడం లేదు. ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ జైలులోనే ఆయనకు ఏదైనా అపాయం కలిగించి ఉంటారని కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే బంధువులను కలవకుండా అడ్డుకుంటున్నారని అనుమానిస్తున్నారు. 21 రోజులకు పైగా గడిచినప్పటికీ ఇమ్రాన్ గురించి ఎటువంటి సమాచారం తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఆరోగ్యం క్షీణించడంపై పాకిస్తాన్‌లో రాజకీయ తుఫాను చెలరేగింది.
వీధుల్లోకి మద్దతుదారులు
అడియాలా జైలులో ఉన్న ఖాన్‌తో మూడు వారాలుగా ఎటువంటి సంప్రదింపులు లేవు. ఆయన సోదరీమణులకు కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో వందలాది మంది పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) కార్యకర్తలు వీధుల్లోకి వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ టైమ్స్ వంటి మీడియా సంస్థలు ఖాన్ హత్య గురించి పుకార్లు వ్యాప్తి చేశాయి. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం వాటిని ‘ఫేక్’ అని కొట్టిపారేసింది. PTI ప్రకారం.. ఖాన్‌ను ఆగస్టు 2023 నుండి అనేక అవినీతి కేసులలో జైలులో ఉంచారు. గత మూడు వారాలుగా ఆయనను ఏకాంత నిర్బంధంలో ఉంచారు. ఇక్కడ కుటుంబం, లాయర్ లేదా డాక్టర్‌తో ఎటువంటి భేటీ జరగడం లేదు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ జైలు అధికారులు కుటుంబ సభ్యులను లోపలికి అనుమతించడం లేదు.
ఖాన్ సోదరీమణులు జైలు వెలుపల ధర్నా
ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు అలీమా ఖాన్, నూరీన్ నియాజీ, డా. ఉజ్మా ఖాన్ నవంబర్ 25న జైలు వెలుపల 10 గంటల పాటు ధర్నా చేశారు. పోలీసులు వారిని ఈడ్చిపారేసి, లాఠీలతో కొట్టి, అదుపులోకి తీసుకున్నారు. అలీమా మాట్లాడుతూ.. “ఇది అమానుషం. మా నేరం కేవలం మా సోదరుడిని కలవాలని కోరుకోవడమే” అని అన్నారు. ఒక సోదరికి గాయాలు కాగా, మహిళా న్యాయవాదులను కూడా కొట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో అర్ధరాత్రి 12:30 గంటలకు పోలీసులు నీటి ఫిరంగులు ప్రయోగించి, లైట్లు ఆపివేసి, కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు.
Also Read: Virat Kohli: ప్రధాని మోదీ విరాట్ కోహ్లీకి కాల్ చేయాలి: పాక్ మాజీ క్రికెటర్
ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTI నాయకుడు గోహర్ అలీ ఖాన్ ఈ సంఘటనను “రాజకీయ హత్యాయత్నం”గా అభివర్ణించారు. సెనేటర్ అల్లామా రాజా నసీర్ అబ్బాస్ హెచ్చరిస్తూ.. “మా సహనాన్ని పరీక్షించకండి. లేకపోతే విప్లవం వస్తుంది” అని అన్నారు. జైలు సూపరింటెండెంట్ ఇస్లామాబాద్ హైకోర్టుకు ఖాన్ ఎక్స్ (ట్విట్టర్) ఖాతా జైలు నుండి నిర్వహించబడటం లేదని చెప్పినప్పటికీ పుకార్లు ఆగడం లేదు. నవంబర్ 25-26 అర్ధరాత్రి వేళ వేలాది మంది మద్దతుదారులు జైలు వెలుపల గుమిగూడారు. “ఫ్రీ ఇమ్రాన్ ఖాన్”, “అసీమ్ మునీర్ హఠావో” అనే నినాదాలు వినిపించాయి. జనరల్ జెడ్ (యువ) కార్యకర్తలు నగరాల్లో మార్చ్‌లు చేస్తున్నారు. ప్రభుత్వం అదనపు భద్రతా బలగాలను మోహరించినప్పటికీ చర్చల తర్వాత ధర్నా ముగిసింది. ఖాన్ సోదరీమణులు పంజాబ్ పోలీసు చీఫ్ ఉస్మాన్ అన్వర్‌కు లేఖ రాసి దీనిని “వ్యవస్థీకృత హింస”గా పేర్కొంటూ “నిష్పక్షపాత విచారణ”కు డిమాండ్ చేశారు.