HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Errabelli Dayakar Rao In Tears

కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు..!

  • Author : Vamsi Chowdary Korata Date : 17-02-2026 - 4:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Errabelli Dayakar Rao
Errabelli Dayakar Rao

Errabelli Dayakar Rao  తొర్రూరులో జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక తీరును చూశాక రాజకీయాల్లో ఉండాలా, వద్దా అనేది అర్థం కావడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూరులో 16 వార్డులకు గాను 9 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఎక్స్అఫీషియో ఓట్లతో కలిపి రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. దీంతో లాటరీ తీయడంతో కాంగ్రెస్ రెండో వార్డు కౌన్సిలర్ శ్రావణ్ కుమార్ చైర్మన్ అయ్యారు.

ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తొర్రూరులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఓ సమయంలో ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు, పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ మున్సిపాలిటీని దక్కించుకుంది.

తొర్రూరు మున్సిపాలిటీని కోల్పోవడంతో ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. రేయింబవళ్లు పార్టీ గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలని రోదిస్తూ అక్కడున్న పోలీసులను ప్రశ్నించారు. పోలీసుల తీరు సరిగ్గా లేదని అన్నారు. ఇంత అరాచకంగా ఎన్నికలు నిర్వహించడమేమిటని ప్రశ్నించారు. కార్యకర్తలు తెగించి పోరాడారని అన్నారు. పోలీసులు రాజ్యాంగ విరుద్ధంగా పని చేశారని అసహనం వ్యక్తం చేశారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దగా, మోసం చూడలేదని కన్నీరు పెట్టుకున్నారు. ఎన్నిక అప్రజాస్వామికంగా నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటివి చూస్తుంటే రాజకీయాల్లో ఉండాలో, వద్దో కూడా అర్థం కావడం లేదని అన్నారు. తొర్రూరు ప్రజలు తమకు పట్టం కడితే ఈ ప్రభుత్వం అన్యాయంగా మున్సిపాలిటీని దక్కించుకుందని అన్నారు. తనను, తన భార్యను అన్యాయంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొర్రూరులోని తన కార్యాలయానికి కూడా వెళ్లనీయడం లేదని ఆరోపించారు. విప్ జారీ చేయకుండా అన్యాయంగా అరెస్టు చేశారని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • congress party
  • errabelli dayakar rao
  • Municipal Chairman Election
  • Municipal Election Results
  • Telangana Municipal Election Results
  • Telangana Municipal Election Results 2026
  • telangana politics
  • Thorrur Municipal Election Results
  • Thorrur Municipality

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Even though KTR got entangled in his own challenge, Revanth Reddy gained the upper hand over BRS!

    Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Delhi High Court deals a blow to Kavitha.

    kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

  • Mallareddy says goodbye to BRS

    Malla Reddy: బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి గుడ్ బై

  • Delhi High Court deals a blow to Kavitha.

    TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే

Latest News

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

  • Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

  • Heavy Rains: తెలంగాణలో భారీ వర్షాలు

  • Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd