HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Cables In The Red Sea Were Cut By Commercial Ships

Red Sea : అందువల్లే.. ఎర్ర సముద్రంలో కేబుళ్లు కట్‌..!

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అంతర్జాతీయ కేబుల్ ప్రొటెక్షన్ కమిటీ నివేదిక ప్రకారం, సౌదీ అరేబియాలోని జెడ్డా తీరానికి సమీపంలో ఈ కేబుళ్లు తెగినట్లు తెలుస్తోంది. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ ప్రాంతంలో అధికంగా నడిచే వాణిజ్య నౌకలు తమ లంగర్లను వదిలే తీరులో, ఆ కేబుళ్లపై ఒత్తిడి పెరిగి, అవి తెగిపోయే అవకాశముందని చెప్పారు.

  • Author : Latha Suma Date : 09-09-2025 - 12:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cables in the Red Sea were cut by commercial ships..!
Cables in the Red Sea were cut by commercial ships..!

Red Sea : ఇటీవల ఎర్ర సముద్రం సమీపంలోని సముద్ర గర్భంలో ఉన్న ముఖ్యమైన ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు తెగిపోవడంతో, భారత్, పాకిస్థాన్‌ సహా ఆసియా, ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఇంటర్నెట్ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇంటర్నెట్ మందగమనం, పలు సైట్ల యాక్సెస్ సమస్యలు వినియోగదారులను ఇబ్బందిపెట్టాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అంతర్జాతీయ కేబుల్ ప్రొటెక్షన్ కమిటీ నివేదిక ప్రకారం, సౌదీ అరేబియాలోని జెడ్డా తీరానికి సమీపంలో ఈ కేబుళ్లు తెగినట్లు తెలుస్తోంది. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ ప్రాంతంలో అధికంగా నడిచే వాణిజ్య నౌకలు తమ లంగర్లను వదిలే తీరులో, ఆ కేబుళ్లపై ఒత్తిడి పెరిగి, అవి తెగిపోయే అవకాశముందని చెప్పారు. ఎర్ర సముద్రం ద్వారా దక్షిణ బాబ్ అల్‌ మందేబ్‌ జలసంధిని దాటి మొత్తం 15 అంతర్జాతీయ ఆప్టికల్ కేబుళ్లు వెళ్తున్నాయి. ఇవి తూర్పు ఆఫ్రికాను అరేబియన్ ద్వీపకల్పం నుంచి డిజిటల్ కనెక్టివిటీ ద్వారా అనుసంధానించడంతోపాటు, ఆసియాతో ఆర్థిక, డిప్లొమాటిక్ సమాచార వ్యవస్థలకు ప్రాణనాడులుగా మారాయి.

Read Also: Gold price : హడలెత్తిస్తున్న బంగారం ధరలు: పసిడి ప్రియులకు షాక్..వెండి కూడా వెనక్కి తగ్గలేదు!

అంతర్జాతీయ కమ్యూనికేషన్ వ్యవస్థలో సముద్రగర్భ కేబుళ్లు అత్యంత కీలకంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో దాదాపు 90% ఈ కేబుళ్ల ద్వారానే ప్రయాణిస్తుంది. శాటిలైట్ కనెక్షన్లు ఉన్నప్పటికీ, అవి ఎక్కువగా బ్యాకప్ లేదా అత్యవసర సేవలకే ఉపయోగపడతాయి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు సాధారణంగా బహుళ యాక్సెస్ పాయింట్లు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రధాన లింకులు తెగిపోతే, సేవల నాణ్యత తగ్గిపోవడం సహజం. ప్రస్తుతం జరిగిన ఈ కేబుల్ డ్యామేజ్ వల్ల భారత్, పాక్‌తోపాటు ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో మొత్తం 10 దేశాల ఇంటర్నెట్ సేవలపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. వినియోగదారులకు డౌన్‌లోడ్ స్పీడ్ మందగించడంతోపాటు, కొన్ని ఆన్‌లైన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని బ్యాంకింగ్, ఎక్స్‌ఛేంజ్ ట్రాన్సాక్షన్లు కూడా ఆలస్యం అయ్యాయి.

మరోవైపు, ఎర్ర సముద్రం ప్రాంతంలో భద్రతా పరిస్థితులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా హూతీ తిరుగుబాటుదారులు ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడులు చేస్తున్నట్లు ఇప్పటికే పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల హూతీలు, సముద్రగర్భ కేబుళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని యత్నిస్తున్నట్లు యెమెన్ ప్రభుత్వం ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలపై హూతీ గ్రూప్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో, ఎర్ర సముద్రంలోని సముద్రగర్భ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భద్రతపై ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ప్రస్తుతానికి 300కు పైగా సముద్రగర్భ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు గ్లోబల్ కమ్యూనికేషన్‌కు కీలకంగా మారాయి. ఈ కేబుళ్ల ద్వారానే రోజుకు బిలియన్‌ డాలర్ల విలువైన అంతర్జాతీయ నగదు లావాదేవీలు, డిప్లొమాటిక్ కమ్యూనికేషన్లు, అత్యవసర సమాచార వ్యవహారాలు సాగుతున్నాయి. ఈ ఘటనతో, భవిష్యత్తులో కేబుళ్ల భద్రతను మరింత బలోపేతం చేయాలన్న అవసరం స్పష్టమవుతోంది. వాణిజ్య నౌకల ట్రాక్ మార్గాలను పునఃసమీక్షించడం, సముద్రతల భద్రతా పర్యవేక్షణ పెంచడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాక, ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ మార్గాల అభివృద్ధి కోసం అంతర్జాతీయంగా మన్నికైన వ్యూహాలు రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Read Also: GHMC : అల్లు ఫ్యామిలీకి మరో షాక్… జీహెచ్‌ఎంసీ నుంచి నోటీసులు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cables Cut
  • Commercial shipping
  • india
  • Jeddah coast
  • pakistan
  • Red Sea
  • Saudi Arabia
  • some countries in Asia
  • Undersea cables

Related News

Canara Bank launches UPI app 'Canara AI 1Pay'

‘కెనరా ఏఐ 1పే’ యూపీఐ యాప్‌ను విడుదల చేసిన కెనరా బ్యాంక్

‘కెనరా ఏఐ 1పే’ అనే పేరుతో ప్రారంభించిన ఈ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) యాప్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడాన్ని ముఖ్య ఉద్దేశ్యంగా పెట్టుకుంది.

  • Donald Trump

    ట్రంప్ నువ్వు మారవా ? మళ్లీ అదే మాట!

  • Bondi Beach

    బాండీ బీచ్ దాడి.. వారికి ఆస్ట్రేలియా ప్రధాని క్షమాపణలు!

  • Jeddah Tower

    బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

  • Toshakhana corruption case: Imran Khan and his wife sentenced to 17 years in prison

    తోషఖానా అవినీతి కేసు: ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలుశిక్ష

Latest News

  • ఇక పై చాట్‌జీపీటీలోనూ వాణిజ్య ప్రకటనలు!

  • 17 ఏళ్ల నిర్బంధానంతరం బంగ్లాకు తారిఖ్ రీఎంట్రీ: భారత్‌కు కలిసొచ్చేనా?

  • జైలర్ 2’లో బాలీవుడ్ బాద్షా ? రివీల్ చేసిన మిథున్ చక్రవర్తి !

  • బీఎల్‌వోల వార్షిక పారితోషికం రెట్టింపు చేసిన ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సీఈవో వివేక్ యాదవ్!

  • క్రిస్మస్ స్ఫూర్తి సమాజంలో సామరస్యం, సద్భావాన్ని ప్రేరేపిస్తుంది: ప్రధాని మోడీ

Trending News

    • మీ స్నేహితులు, బంధుమిత్రులకు క్రిస్మస్ ఇలా తెలియజేయండి!

    • క్రిస్మస్ కేక్ కథ.. గంజి నుండి ఫ్రూట్ కేక్ వరకు ఎలా మారింది?

    • టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కార‌ణ‌మిదేనా?

    • నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji

    • శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd