HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Good News For Gold Enthusiasts Gold And Silver Prices Are On The Decline

పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు

  • Author : Vamsi Chowdary Korata Date : 16-03-2026 - 10:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Rate
Gold Rate

Gold  బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ ఊరట కలిగింది. గత వారం వరుస సెషన్లలో గోల్డ్ రేట్లు తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సోమవారం రోజు గోల్డ్, సిల్వర్ రేట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. భారీగా తగ్గి స్థిరంగానే కొనసాగుతున్నాయి. మార్చి 16 హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

పసిడి ప్రియులకు ఊరట కలిగింది. ఒకవైపు అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ.. బంగారం ధరలు తగ్గుతుండటం విశేషం. సాధారణంగా ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో.. సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. బంగారం ధరలు తగ్గుతుండటం విశేషం. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభం కాగా.. అక్కడి నుంచి 2-3 రోజులు మాత్రమే బంగారం ధర పెరిగింది. మిగతా అన్ని రోజుల్లోనూ గోల్డ్ రేటు తగ్గుముఖం పట్టింది. దీంతో కొనుగోలుదారులకు ఊరట కలిగిందని చెప్పొచ్చు. బంగారం ధర తగ్గేందుకు చాలానే కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మార్చి 16న (సోమవారం) బంగారం, వెండి రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.

>> ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే స్పాట్ గోల్డ్ రేటు ఇప్పుడు ఔన్సుకు 5020 డాలర్ల స్థాయిలో ఉంది. శని, ఆదివారాల్లో కూడా దాదాపు ఇదే స్థాయిలో ఉంది. సిల్వర్ రేటు చూస్తే ప్రస్తుతం 80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 92.48 వద్ద కొనసాగుతోంది.

దేశీయంగా బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగానే ఉన్నాయి. మార్చి 16న ప్రస్తుతం వార్త రాసే సమయంలో ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు తులం రూ. 1,46,350 వద్ద ఉంది. దీనికి ముందు వరుసగా రూ. 950, రూ. 1400, రూ. 1000 తగ్గుముఖం పట్టింది. మరోవైపు 24 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 1,59,660 వద్ద ట్రేడవుతోంది. ఇది అంతకుముందు వరుస సెషన్లలో రూ. 1030, రూ. 1530, రూ. 1090 మేర పతనమైంది.

బంగారం ధర బాటలోనే వెండి రేట్లు కూడా స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేటు రూ. 2.80 లక్షల వద్ద ఉంది. దీనికి ముందు మార్చి 14న రూ. 10 వేలు, మార్చి 12న రూ. 10 వేల మేర తగ్గుముఖం పట్టింది. ఇది గరిష్ఠాల నుంచి రూ. 1.50 లక్షల వరకు తగ్గడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయంగా మార్చి 16న ఉదయం 10 గంటల తర్వాత మారనున్నాయని చెప్పొచ్చు. మళ్లీ తగ్గే అవకాశాలే కనిపిస్తున్నాయి. యూఎస్ డాలర్ పుంజుకోవడం వల్ల బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయని చెప్పొచ్చు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22K gold price
  • 24K gold price
  • Global Gold Prices
  • gold market . today gold price
  • gold sliver
  • sliver price

Related News

Gold Price Today

Gold Price: పసిడి ప్రియులకు షాక్

GOLD బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. వరుసగా మూడో రోజు కూడా వాటి జోరు కొనసాగింది. బుధవారం ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1,51,500కి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. మరోవైపు కిలో వెండి ధర కూడా రూ. 5,000 పెరిగి రూ. 2,37,000కి ఎగబాకింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో కొనుగోళ్ల ఆసక్తి పెరగడం ధరల పెరుగుదలకు దోహదపడింది. ఇరాన్‌తో యుద్ధం రెండు

    Latest News

    • క‌రోనా కొత్త వేరియంట్‌.. చిన్న పిల్ల‌ల‌పై ప్ర‌భావం?

    • ఈసీ విష‌యంలో విప‌క్షాల‌కు బిగ్ షాక్‌..!

    • Cricket : ఒక్క రన్ ప్రాణం పోయేలా చేసింది !!

    • Telangana Govt School : ప్రభుత్వ స్కూల్స్ లలో యూకేజీ తరగతులు

    • Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గొప్ప శుభవార్త

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd