Nine Killed: పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి.. తొమ్మిది మంది పోలీసులు మృతి
నైరుతి పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. బైక్ పై వచ్చిన ఆత్మాహుతి సభ్యుడు పోలీసు వాహనాన్ని వెనుకనుంచి బలంగా ఢీకొట్టాడు. దాంతో 9 మంది పోలీసు అధికారులు దుర్మరణం (Nine Killed) పాలయ్యారు. ఏడుగురికి గాయాలయ్యాయి.
- By Gopichand Published Date - 06:38 AM, Tue - 7 March 23

పాకిస్థాన్‌లో మరోసారి ఆత్మాహుతి బాంబు పేలుడు సంభవించింది. పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 9 మంది పోలీసులు మరణించారు. నైరుతి పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. బైక్ పై వచ్చిన ఆత్మాహుతి సభ్యుడు పోలీసు వాహనాన్ని వెనుకనుంచి బలంగా ఢీకొట్టాడు. దాంతో 9 మంది పోలీసు అధికారులు దుర్మరణం (Nine Killed) పాలయ్యారు. ఏడుగురికి గాయాలయ్యాయి. తొమ్మిది మంది పోలీసులు మరణించారని పాకిస్తాన్ పోలీసు ప్రతినిధి తెలిపారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు తూర్పున 160 కి.మీ (100 మైళ్లు) దూరంలో ఉన్న సిబ్బి పట్టణంలో ఈ దాడి జరిగిందని అధికార ప్రతినిధి మహమూద్ ఖాన్ నోటిజై చెప్పారు.
Also Read: Adenovirus: అడెనోవైరస్ కలకలం.. పశ్చిమ బెంగాల్ లో మాస్క్ తప్పనిసరి
భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి దాడికి పాల్పడ్డారు. బలూచిస్థాన్ పోలీసులు విధుల నుంచి తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. ఆత్మాహుతి దాడిలో 9 మంది పోలీసులు మృతి చెందడంతో భయానక వాతావరణం నెలకొంది. ఈ దాడిలో కనీసం 7 మంది పోలీసులు గాయపడ్డారని ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఆత్మాహుతి బాంబర్ మోటారుసైకిల్‌పై వెళుతూ పోలీసు ట్రక్కును ఢీకొట్టాడని, ఆ తర్వాత పెద్ద శబ్దంతో పేలుడు వచ్చి వాహనం బోల్తా కొట్టిందని చెబుతున్నారు. ఈ ఆత్మాహుతి దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఏ ఉగ్రవాద సంస్థ ఇంకా ప్రకటించలేదు.
గత నెలలో కరాచీలో కూడా దాడి జరిగింది. కరాచీ పోలీసు కార్యాలయం (కెపిఓ)పై సైనిక దుస్తులు ధరించిన వ్యక్తులు దాడి చేశారు. ఈ సందర్భంగా కాల్పులు జరిగాయి. పాకిస్తాన్ భద్రతా దళాలు ప్రతీకార కాల్పుల్లో 5 TTP ఉగ్రవాదులను హతమార్చాయి. ఇందులో నలుగురు పోలీసులు మృతి చెందినప్పటికీ ఈ దాడిలో 15 మందికి పైగా గాయపడ్డారు. గతంలో పాకిస్థాన్‌లోని పెషావర్‌లోని పోలీసు లైన్‌కు సమీపంలో ఉన్న మసీదులో ఆత్మాహుతి బాంబు పేలుడు జరిగింది. ఆ’ సమయంలో 100 మందికి పైగా మరణించారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

Related News

Rishi Sunak: క్రికెట్ ఆడిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. వీడియో వైరల్
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) తన చర్యలతో సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారారు. టీ20 వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టును తాను నివాసం ఉంటున్న 10 డౌనింగ్ స్ట్రీట్‌కు ఆహ్వానించారు.