Adenovirus: అడెనోవైరస్ కలకలం.. పశ్చిమ బెంగాల్ లో మాస్క్ తప్పనిసరి
కరోనా వైరస్ తర్వాత దేశం అడెనోవైరస్ (Adenovirus) ముప్పును ఎదుర్కొంటోంది. పశ్చిమ బెంగాల్‌లో అడెనోవైరస్ విధ్వంసం కొనసాగుతోంది. దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదకరమైన వైరస్‌ను నివారించడానికి మరోసారి మాస్కులు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
- By Gopichand Published Date - 06:23 AM, Tue - 7 March 23

కరోనా వైరస్ తర్వాత దేశం అడెనోవైరస్ (Adenovirus) ముప్పును ఎదుర్కొంటోంది. పశ్చిమ బెంగాల్‌లో అడెనోవైరస్ విధ్వంసం కొనసాగుతోంది. దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదకరమైన వైరస్‌ను నివారించడానికి మరోసారి మాస్కులు ధరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమత సోమవారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు 6 మంది చిన్నారులు అడెనోవైరస్ కారణంగా మరణించారని తెలిపారు. ఆమె కుటుంబంలోని ఒకరికి కూడా ఈ వైరస్ సోకినట్లు తెలిపారు. అయితే, ఆ సభ్యుని గురించి మరింత సమాచారం ఇవ్వలేదు. భయపడవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మమత సూచించారు. జ్వరం వస్తే వెంటనే డాక్టర్‌ని కలవండని అన్నారు. రాష్ట్రంలో అడెనోవైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ పిల్లలకు మాస్క్‌లు ధరించాలని సూచించారు. పిల్లలు భయపడవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మమతా బెనర్జీ కోరారు.
అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ (ఏఆర్‌ఐ) కారణంగా ఇప్పటివరకు 19 మంది మరణించారని.. వీరిలో 13 మందికి కొమొర్బిడిటీలు (బీపీ, షుగర్ వంటి వ్యాధులు) ఉన్నాయని, 6 మంది చిన్నారులు అడెనోవైరస్ తో మరణించారని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. ప్రస్తుతం ఫేస్ మాస్క్‌లు ధరించడం ప్రారంభించాలని నేను ప్రజలను కోరుతున్నాను. కోవిడ్ కాలంతో పోల్చితే పశ్చిమ బెంగాల్‌లో ఆరోగ్య సేవలలో చాలా మెరుగుదల ఉందని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.
Also Read: Transgender : ప్రాణాలు విడిచిన ట్రాన్స్ జెండర్ ఎంపీ.. బ్రతికున్నంత కాలం శభాష్ అనిపించుకుందిగా?
రాష్ట్రంలో లెఫ్ట్ ఫ్రంట్ పాలనలో రాష్ట్రంలో ప్రత్యేక నవజాత సంరక్షణ యూనిట్లు లేవని, ప్రస్తుతం 138 ఆసుపత్రులలో 2,486 SNCUలు ఉన్నాయని అన్నారు. అడెనోవైరస్ పరిస్థితిని ఎదుర్కోవటానికి తన పరిపాలన ద్వారా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి గత వారం చెప్పారు. “మేము 5,000 పడకలను సిద్ధం చేసాము. అటువంటి కేసులను పరిష్కరించడానికి 600 మంది వైద్యులకు బాధ్యత అప్పగించాం” అని ఆమె చెప్పారు. వైద్యుల ప్రకారం.. ఈ అడెనోవైరస్లు సాధారణంగా తేలికపాటి జలుబు లేదా ఫ్లూ లాంటి అనారోగ్యానికి కారణమవుతాయి. దీని సాధారణ లక్షణాలు ఫ్లూ లాంటివి, ఇందులో జలుబు లేదా ఫ్లూ, జ్వరం, గొంతు నొప్పి, తీవ్రమైన బ్రోన్కైటిస్, న్యుమోనియా, పింక్ ఐ వంటివి ఉండవచ్చు. దీని బారిన పడినప్పుడు, వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని అనుభవిస్తారు.

Related News

Mamata Banerjee: నవీన్ పట్నాయక్ తో మమతా బెనర్జీ భేటీ.. కొత్త ఫ్రంటే లక్ష్యమా..?
లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత, భిన్న ఫ్రంట్‌లపై చర్చల మధ్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధ్యక్షురాలు మమతా బెనర్జీ (Mamata Banerjee) గురువారం (మార్చి 23) ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్‌ను కలిశారు.