Border Seize : చైనా – మయన్మార్ బార్డర్ క్రాసింగ్‌పై మిలిటెంట్ల కబ్జా
Border Seize : సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.
- By Pasha Published Date - 02:43 PM, Sun - 26 November 23

Border Seize : సైనిక పాలనలో ఉన్న మయన్మార్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. చైనా బార్డర్ పాయింట్‌పై మయన్మార్ ఆర్మీ పట్టు కోల్పోయింది. ‘కైన్ శాన్ క్యావ్ట్’ అనే పేరు కలిగిన ఆ పాయింట్‌ను ఒక ప్రైవేట్ మిలిటెంట్ గ్రూప్ స్వాధీనం చేసుకుంది. మూడు మిలిటెంట్ గ్రూపులు కలిసి మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ (MNDAA)ని ఏర్పాటు చేశాయి. వాటిలోనే ఒక మిలిటెంట్ గ్రూప్ ఇప్పుడు చైనా బార్డర్ గేట్‌ను కంట్రోల్‌లోకి తీసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
అక్టోబరు నుంచే మయన్మార్ ఆర్మీపై మిలిటెంట్ల కూటమి MNDAA దాడులు చేస్తోంది. ప్రస్తుతం చైనా-మయన్మార్ సరిహద్దు సమీపంలోని మయన్మార్ దేశానికి చెందిన నార్తెర్న్ షాన్ రాష్ట్రం అంతటా సైన్యం, ఎంఎన్డీఏఏ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పటికే డజన్ల కొద్దీ సైనిక స్థావరాలను MNDAA మిలిటెంట్లు స్వాధీనం చేసుకున్నారు. చైనాతో వాణిజ్యం చేసేందుకు ముఖద్వారంగా ఉండే కీలకమైన పట్టణం కూడా ఆర్మీ నుంచి చేజారి, మిలిటెంట్ల చేతికి(Border Seize) చిక్కింది.
Also Read: WhatsApp Feature : ఇక వాట్సాప్ ఛాట్స్‌లోనే అది కూడా కనిపిస్తుందట
భారత్ పొరుగు దేశమైన మయన్మార్‌లో కొంతకాలంగా కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నడుమ భారత్ అప్రమత్తమైంది. మయన్మార్‌లో దిగజారుతోన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా.. భారతీయ పౌరులు ఆ దేశానికి అనవసరమైన ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. మయన్మార్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు యాంగాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపింది. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా చర్యలు తీసుకునేందుకు వీలవుతుందని చెప్పింది.