WhatsApp Feature : ఇక వాట్సాప్ ఛాట్స్‌లోనే అది కూడా కనిపిస్తుందట
WhatsApp Feature : వాట్సాప్‌లో కొత్తకొత్త ఫీచర్స్ క్యూ కడుతున్నాయి. త్వరలో మరో కొత్త ఫీచర్ కూడా రాబోతోంది.
- By Pasha Published Date - 01:59 PM, Sun - 26 November 23

WhatsApp Feature : వాట్సాప్‌లో కొత్తకొత్త ఫీచర్స్ క్యూ కడుతున్నాయి. త్వరలో మరో కొత్త ఫీచర్ కూడా రాబోతోంది. అదేమిటంటే.. ఇకపై వాట్సాప్ చాట్‌లలోనూ వాట్సాప్ యూజర్స్ ప్రొఫైల్ సమాచారం కనిపిస్తుంది. ఎవరితోనైతే మనం ఛాట్ చేస్తున్నామో.. ఆ వ్యక్తి ప్రొఫైల్ సమాచారం ఛాట్ విండోలో డిస్‌ప్లే కావడమే కొత్త ఫీచర్ ప్రత్యేకత. దీనివల్ల మనం ఛాట్ చేస్తున్న వ్యక్తి ప్రొఫైల్‌ను చెక్ చేయాల్సిన అవసరం కానీ.. మళ్లీమళ్లీ వెనక్కి, ముందుకు వెళ్లి సమయం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కానీ ఉండదు.
We’re now on WhatsApp. Click to Join.
కాంటాక్ట్ లిస్టులో ఉన్న వ్యక్తితో మనం ఛాట్ చేస్తుంటే.. అతడు ఆఫ్ లైన్‌లో ఉన్నా ప్రొఫైల్ ఇన్ఫోను దర్జాగా చూడొచ్చు. మనతో తరుచూ ఛాట్ చేసేవారు ఎవరైనా ఇటీవల వాట్సాప్ ప్రొఫైల్ వివరాలను అప్‌డేట్ చేసి ఉంటే.. వాటిని వెంటనే చూసేందుకు ఈ ఫీచర్ వెసులుబాటును కల్పిస్తుంది. ఒకవేళ ఇలా మీ వాట్సాప్ ప్రొఫైల్‌ను ఎవరుపడితే వారు చూడొద్దని భావిస్తే జాగ్రత్త పడొచ్చు.
Also Read: Imran Wife Vs Ex Husband : ఇమ్రాన్‌ఖాన్ నా భార్యను లోబర్చుకొని కాపురం కూల్చాడు : ఖవార్ ఫరీద్
వాట్సాప్ ప్రొఫైల్ ఇన్ఫోను ఎవరు చూడాలి ? ఎవరు చూడొద్దు ? అనే విషయాన్ని ‘ప్రైవసీ సెట్టింగ్స్’ సెక్షన్‌లో మనం మార్చుకోవచ్చు. అందరూ చూడొచ్చా ? కేవలం కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారే చూడాలా ? మీరు ఎంపిక చేసే వ్యక్తులే చూడాలా ? అనేది ‘ప్రైవసీ సెట్టింగ్స్’ ఆప్షన్‌లోకి వెళ్లి మనం డిసైడ్ చేయొచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్మెంట్ దశలోనే(WhatsApp Feature) ఉంది.