HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >After A Historic Trade Deal America Suffered A Setback

అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన భార‌త్‌!

బోర్డ్ ఆఫ్ పీస్ నిర్వహించబోయే ఈ మొదటి సమావేశానికి పలు దేశాలు హాజరయ్యే అవకాశం ఉంది.

  • Author : Gopi Date : 10-02-2026 - 9:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
America
America

America: భారత్- అమెరికా మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తర్వాత అమెరికా భారత్‌పై విధిస్తున్న టారిఫ్‌లను 50 శాతం నుండి ఏకంగా 18 శాతానికి తగ్గించింది. వీటితో పాటు పలు ఉత్పత్తులపై ఇరు దేశాలు ‘జీరో టారిఫ్’ (సున్నా సుంకం) విధానానికి అంగీకరించాయి. ఈ పరిణామంతో భారత్- అమెరికా మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంతగా మెరుగుపడ్డాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇదే సమయంలో భారత్ తీసుకున్న ఒక నిర్ణయం అమెరికాకు గట్టి షాక్ ఇచ్చేలా ఉంది. రాబోయే ‘గాజా శాంతి సమావేశానికి’ హాజరుకాకూడదని భారత్ నిర్ణయించుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధాన్ని నిలిపివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గాజాలో శాంతిని నెలకొల్పేందుకు ట్రంప్ ఒక ప్రత్యేక శాంతి ప్రణాళికను సిద్ధం చేశారు. దీనిపై ఇటు పాలస్తీనా, అటు ఇజ్రాయెల్ కూడా సానుకూల స్పందన వ్యక్తం చేశాయి. ఈ శాంతి ప్రణాళికను పర్యవేక్షించేందుకు ట్రంప్ ఒక ప్రత్యేక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఇందులో అనేక దేశాలు సభ్యులుగా ఉన్నాయి.

Also Read: రక్తనాళాల ఆరోగ్యమే మెదడు ఆరోగ్యం !!

అయితే ఈ బోర్డులో పాకిస్థాన్, తుర్కియే (టర్కీ) దేశాలు కూడా భాగస్వాములుగా ఉండటంతో భారత్ మొదటి నుంచీ ఈ బోర్డుకు దూరంగా ఉంటూ వస్తోంది. ఫిబ్రవరి 19న గాజా శాంతి బోర్డు తొలి సమావేశం జరగనుంది. అమెరికాతో భారీ వాణిజ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో భారత్ తన నిర్ణయాన్ని మార్చుకుని ఈ సమావేశానికి హాజరవుతుందని అంతా ఆశించారు. కానీ తాజా సమాచారం ప్రకారం భారత్ తన పాత వైఖరికే కట్టుబడి ఉంది.

బోర్డ్ ఆఫ్ పీస్ నిర్వహించబోయే ఈ మొదటి సమావేశానికి పలు దేశాలు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత ప్రభుత్వం ట్రంప్ ప్రతిపాదించిన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోందని, అందుకే తొలి సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో జరిగే పరిణామాలను బట్టి భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవాలని భారత్ యోచిస్తోంది. ఇటీవల అరబ్ లీగ్ దేశాల విదేశాంగ మంత్రులతో జరిగిన భేటీలో కూడా ట్రంప్ శాంతి బోర్డు గురించి చర్చకు వచ్చింది. ఈ బోర్డులో అనేక అరబ్ దేశాలు ఉన్నప్పటికీ అవి కూడా ఈ సమావేశానికి హాజరయ్యే విషయంపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • Gaza Attack
  • india
  • pm modi
  • Trump
  • USA- India
  • world news

Related News

US attacks ship off Oman coast; three Indian sailors killed.

ఒమాన్ తీరంలో నౌకపై అమెరికా దాడి.. ముగ్గురు భార‌త నావికులు మృతి

ఒమన్‌ తీరానికి సమీపంలో అమెరికా బలగాలు జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించినట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ వెల్లడించారు. తొలుత వీరు గల్లంతైనట్లు సమాచారం వచ్చినా ఇప్పుడు వారి మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించారు. ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు మాత్రమే ఇప్పటివరకు లభ్యమైనట్లు తెలిపారు. పలావు జెండాతో ప్రయాణిస్తున్న సెటెబెల్లో ఆయిల్‌ ట్యాంకర్‌పై ఈ దాడి జర

    Latest News

    • Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

    • G7 Summit: జీ7 వేదికగా ట్రంప్ సంచలనం!

    • Negative Energy: ఇలా చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పోవడం ఖాయం..!!

    • Talliki Vandanam: ఆ రోజు మీ అకౌంట్ లోకి తల్లికి వందనం.. డేట్ ఫిక్స్

    • Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd