Earthquake: ఇండోనేషియాను వణికించిన భూకంపం.. పరుగులు తీసిన జనం
ఇండోనేషియా (Indonesia)లో మరోసారి భూకంపం (Earthquake)సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది.
- By Gopichand Published Date - 06:29 AM, Sat - 15 April 23

ఇండోనేషియా (Indonesia)లో మరోసారి భూకంపం (Earthquake)సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.0గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఈ భూకంపం సంభవించింది. దీని కేంద్రం ఇండోనేషియాలోని తుబాన్‌కు ఉత్తరాన 96 కిమీ దూరంలో ఉంది. భూకంప తీవ్రతను చూస్తే ప్రమాదకరమని చెప్పవచ్చు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి వార్త తెరపైకి రాలేదు. బలమైన ప్రకంపనల కారణంగా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇండోనేషియా వాతావరణ శాస్త్రం, క్లైమాటాలజీ, జియోఫిజికల్ ఏజెన్సీ సునామీ ముప్పు లేదని తెలిపింది.
Also Read: Netizens: కుక్కలపై దారుణంగా ప్రవర్తించిన మహిళ.. మండిపడుతున్న నెటిజన్లు
తాజా భూకంపానికి సంబంధించి ఇండోనేషియాలోని జావా ద్వీపానికి ఉత్తరాన సముద్రంలో 7.0 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) శుక్రవారం తెలిపింది. అంతకుముందు గురువారం కూడా ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. అప్పుడు భూకంప తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ. గురువారం సంభవించిన భూకంప తీవ్రత 4.9గా నమోదైంది. భూకంపం 70 కిలోమీటర్ల లోతులో ఉండడంతో స్వల్పంగా భూమి కంపించడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.