Girl Shoots Grandmother: అమెరికాలో షాకింగ్ ఘటన.. అమ్మమ్మపై కాల్పులు జరిపిన ఆరేళ్ల చిన్నారి..!
అమెరికాలో 6 ఏళ్ల బాలిక కదులుతున్న కారులో అమ్మమ్మపై కాల్పులు (Girl Shoots Grandmother) జరిపింది. ఈ సంఘటన ఫిబ్రవరి 16న జరిగింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ ఆరేళ్ల బాలిక కదులుతున్న కారులో వెనుక సీటు నుంచి అమ్మమ్మపై కాల్పులు జరిపింది.
- Author : Gopichand
Date : 19-02-2023 - 9:10 IST
Published By : Hashtagu Telugu Desk
అమెరికాలో 6 ఏళ్ల బాలిక కదులుతున్న కారులో అమ్మమ్మపై కాల్పులు (Girl Shoots Grandmother) జరిపింది. ఈ సంఘటన ఫిబ్రవరి 16న జరిగింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ ఆరేళ్ల బాలిక కదులుతున్న కారులో వెనుక సీటు నుంచి అమ్మమ్మపై కాల్పులు జరిపింది. ఆ చిన్నారి కారు వెనుక సీటులో కూర్చుంది. తుపాకీ చేతిలో ఉంది. దాని కారణంగా చిన్నారి.. అమ్మమ్మపై కాల్పులు జరిపింది.
నార్త్ పోర్ట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం.. కారు వెనుక సీటులో ఆ ఆరేళ్ల చిన్నారికి తన 57 ఏళ్ల అమ్మమ్మ తుపాకీ దొరికింది. కాగా.. మధ్యాహ్నం 3 గంటల సమయంలో బాలిక కదులుతున్న కారులో కాల్పులు జరిపింది. దానిని ఆపరేట్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తూ ఓ బుల్లెట్ పేలింది. బుల్లెట్ బాలిక అమ్మమ్మకు వీపు కింది భాగంలో తగిలింది. అదృష్టవశాత్తు ఆ మహిళ సకాలంలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడింది.
ఫాక్స్ న్యూస్ ప్రకారం.. కాల్పులు జరిపిన తర్వాత మహిళను కూడా ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. 57 ఏళ్ల మహిళ తన 6 ఏళ్ల మనవరాలు కారు వెనుక సీటులో కూర్చున్నట్లు చెప్పింది. అప్పుడు ఆమెకి తుపాకీ దొరికింది. అనుకోకుండా తుపాకీ పేలింది. దీంతో మహిళ వీపు కింది భాగంలో కాల్పులు జరిగాయి. అయితే, బుల్లెట్ తగిలిన తరువాత కూడా ఆమె కారును ఇంటివరకు డ్రైవ్ చేయగలిగింది. ఇంటికి చేరుకున్న వెంటనే US ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ 911కి కాల్ చేసారు.వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు.
ఆయుధాన్ని మొదట హోల్‌స్టర్‌లో ఉంచినట్లు పోలీసు శాఖ గుర్తించింది. ఇది డ్రైవర్ సీటు వెనుక జేబులో సీటు కవర్ కింద ఉంచబడింది. ఈ విషయంలో దర్యాప్తు ప్రారంభించామని, బాలికను కూడా విచారించామని నార్త్ పోర్ట్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. బుల్లెట్ పొరపాటున పేలినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.