HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Gold And Silver Prices Fall Again

మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధర

  • Author : Vamsi Chowdary Korata Date : 10-03-2026 - 11:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold Price Down
Gold Price Down

Gold Price  బంగారం కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. క్రితం రోజు కాస్త పెరిగినట్లు కనిపించినా మళ్లీ తగ్గడం మంచి అవకాశంగా చెప్పవచ్చు. మార్చి 10వ తేదీన ఉదయం 22 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.1800 మేర దిగిచ్చింది. ఈ క్రమంలో 22, 24 క్యారెట్ల బంగారం, కిలో వెండి రేటు ఎంతెంత పలుకుతున్నాయో తెలుసుకుందాం.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం ధరలు పెరుగుతుంటాయి. సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకుంటారు. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం మొదలైనప్పుడు అదే జరిగింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. బంగారం ధరలపై యుద్ధంతో పాటు ఇతర అంశాలు ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో పసిడి రేట్లు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. గత శనివారం సెషన్‌లో పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగి ఆందోళన కలిగించినా ఆ మరుసటి రోజు నుంచి మళ్లీ తగ్గుముఖం పట్టడం భారీ ఊరటగా చెప్పవచ్చు. ప్రస్తుతం భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో బంగారం ధరలు దిగిరావడం కొనుగోలుదారులకు ఉపశమనం కల్పిస్తుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో మార్చి 10వ తేదీన హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్లో పసిడి రేట్లు మళ్లీ భారీగా తగ్గాయి. ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములపై రూ. 1800 మేర దిగివచ్చింది. దీంతో తులం బంగారం రేటు రూ. 1,48,200 వద్దకు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 1960 మేర పడిపోయింది. దీంతో తులం ప్యూర్ గోల్డ్ రేటు రూ. 1,61,680 వద్దకు దిగివచ్చింది.

స్థిరంగానే వెండి రేటు

బంగారం ధరలు అటూ ఇటూ మారుతున్నప్పటికీ వెండి రేటు మాత్రం స్థిరంగానే కొనసాగుతోంది. గత వారంలో కిలో వెండి ధర రూ. 30 వేలు మేర తగ్గిన సంగతి తెలిసింది. ఇప్పుడు అదే ధర వద్ద ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ. 2,90,000 పలుకుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 25 డాలర్లు మేర తగ్గింది. దీంతో ఔన్స్ పుత్తడి రేటు 5149 డాలర్ల వద్దకు దిగివచ్చింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 4 శాతం పెరిగింది. దీంతో ఔన్స్ వెండి ధర 88 డాలర్ల స్థాయిలో కదలాడుతోంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్చి 10వ తేదీ మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో ధరలు మధ్యాహ్నంలోపు మారిపోతుంటాయి. కొనేవారు ముందు స్థానికంగా ధరలు తెలుసుకోవడం మంచిది. ప్రాంతాలను బట్టి ధరలు వేరు వేరుగా ఉంటాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22K gold rate
  • 24 Carat Gold Rate
  • 24 carat gold rate today
  • 24K gold price
  • Daily gold price
  • Global Gold Prices
  • gold price
  • gold sliver
  • sliver price

Related News

Gold prices drop—a great opportunity for buyers.

Gold Price: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్

భారత్‌లో పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటే ముందుగా గుర్తుకువచ్చేది బంగారమే. భారతీయుల జీవన విధానంలో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏడాది పొడవునా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే, గత ఏడాదిగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇక ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల పసిడి రేట్లలో ఊహించని మార్పులు కనిపిస్తున

  • Good news for gold lovers: Gold prices have dropped sharply.

    Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

Latest News

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

  • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

  • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

  • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd