Viral Story : సినిమాను మించిన ట్విస్ట్.. పెళ్లి వేదికపై కలిసిన తల్లీకూతుళ్లు
Viral Story : సాధారణంగా పెళ్లిళ్లంటే బంధుమిత్రుల సందడి, సంగీతం, ఆనందం, హాస్యకళలు కనిపిస్తాయి. కానీ చైనాలోని సుజౌ నగరంలో జరిగిన ఓ పెళ్లి వేడుక మాత్రం అందరినీ షాక్‌కు గురి చేసింది.
- By Kavya Krishna Published Date - 10:46 AM, Wed - 20 August 25

Viral Story : సాధారణంగా పెళ్లిళ్లంటే బంధుమిత్రుల సందడి, సంగీతం, ఆనందం, హాస్యకళలు కనిపిస్తాయి. కానీ చైనాలోని సుజౌ నగరంలో జరిగిన ఓ పెళ్లి వేడుక మాత్రం అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ పెళ్లి వేడుకలో చోటుచేసుకున్న సంఘటనలు కేవలం వధూవరులను మాత్రమే కాదు, అక్కడికి హాజరైన ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురి చేశాయి. 2021లో జరిగిన ఈ వివాహ వేడుకలో, వరుడి తల్లి అనుకోకుండా పెళ్లికూతురి చేతిపై ఉన్న ఒక పుట్టుమచ్చను గమనించింది. అది అచ్చం తన చిన్నప్పుడే తప్పిపోయిన కుమార్తెకు ఉన్న పుట్టుమచ్చలాగే ఉందని గుర్తుచేసుకుంది. ఒక్కసారిగా ఆమె హృదయం ఉలిక్కిపడింది. వెంటనే పెళ్లికూతురి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి ఒక అనూహ్యమైన ప్రశ్న వేసింది.. “మీరు మీ అమ్మాయిని దత్తత తీసుకున్నారా?” అని.
ఆ ప్రశ్న విన్న పెళ్లికూతురి తల్లిదండ్రులు ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. తరువాత వారు నిజాయితీగా సమాధానం చెప్పారు: “అవును. నాలుగేళ్ల వయసులో రోడ్డు పక్కన శిశువుగా వదిలిపెట్టబడి ఉండగా దొరికింది. అప్పటి నుంచి ఆమెను మా సొంత కూతురిలా పెంచుకుంటూ వచ్చాం.” ఈ సమాధానం విన్న వెంటనే వరుడి తల్లి తట్టుకోలేకపోయింది. అక్కడికక్కడే కన్నీరు పెట్టుకుని, ఆ వధువు తానే తన ఏళ్ల క్రితం తప్పిపోయిన కన్న కూతురే అని వెల్లడించింది. వధువు కూడా తన అసలు తల్లిదండ్రుల కోసం ఎన్నాళ్లుగా వెతుకుతున్నానని చెబుతూ, భావోద్వేగంతో తల్లి ఒడిలో పడిపోయింది. ఆ క్షణంలో పెళ్లి వేదికపై జరిగిన తల్లీకూతుళ్ల కలయిక అందరినీ కదిలించింది. పెళ్లి వేడుక కన్నీటి వేదికగా మారింది.
Airtel : జియో బాటలో ఎయిర్‌టెల్..ఇక పై ఆ ప్లాన్స్ మరచిపోవాల్సిందే !!
అయితే, ఈ సంఘటనతో వధూవరులు నిజానికి అన్నాచెల్లెళ్లు అవుతారా? అనే అనుమానం కుటుంబ సభ్యులందరికీ కలిగింది. పెళ్లి ఆగిపోతుందేమోనని అందరూ ఆందోళన చెందుతుండగా, వరుడి తల్లి మరో కీలక విషయాన్ని బయటపెట్టింది. తన కూతురు చిన్ననాటి లోనే తప్పిపోవడంతో తీవ్ర మానసిక వేదనను భరించలేక, తాను ఒక బాబును దత్తత తీసుకున్నానని వెల్లడించింది. ఆ దత్తత తీసుకున్న బాబు ఎవరో కాదు, ఈ పెళ్లి కాబోయే వరుడే అని తెలిపింది. దీంతో వధూవరులకు ఎలాంటి రక్త సంబంధం లేదని తేలిపోయింది. ఈ విషయాన్ని విన్న వెంటనే కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
అందరూ ఒక్క క్షణం వరకు ఉత్కంఠగా ఉండగా, నిజం బయటకొచ్చిన వెంటనే వాతావరణం మళ్లీ ఆనందభరితంగా మారింది. ఆగిపోతుందనుకున్న పెళ్లి రెట్టింపు ఆనందంతో ఘనంగా జరిగింది. ఈ ఘటనను చూసిన ప్రతి ఒక్కరు “ఇది నిజ జీవితంలో జరుగుతుందా?” అని ఆశ్చర్యపడ్డారు. ఈ విచిత్ర సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు 2021లోనే వైరల్ అయినప్పటికీ, తాజాగా మళ్లీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
ISRO: 40 అంతస్తుల ఎత్తైన జంబో రాకెట్