Airtel : జియో బాటలో ఎయిర్‌టెల్..ఇక పై ఆ ప్లాన్స్ మరచిపోవాల్సిందే !!
Airtel : ఒకప్పుడు 10 రూపాయలకే టాప్‌అప్ చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అన్ని రీఛార్జ్‌లు వ్యాలిడిటీ ఆధారంగా 14 రోజుల నుంచి ఏడాది వరకు ఉండే ప్యాకేజీలుగా మారిపోయాయి
- By Sudheer Published Date - 10:15 AM, Wed - 20 August 25

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ లేనిదే జీవితం అసాధ్యంగా మారింది. ఫోన్‌లో వార్తలు, వీడియోలు, సోషల్ మీడియా చూస్తూ గడపడం అలవాటైపోయింది. ఈ డిమాండ్‌ను పసిగట్టిన టెలికాం కంపెనీలు వినియోగదారుల కోసం ఎక్కువగా డేటా ప్లాన్లనే అందిస్తున్నాయి. ఒకప్పుడు 10 రూపాయలకే టాప్‌అప్ చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అన్ని రీఛార్జ్‌లు వ్యాలిడిటీ ఆధారంగా 14 రోజుల నుంచి ఏడాది వరకు ఉండే ప్యాకేజీలుగా మారిపోయాయి. వాయిస్ ఓన్లీ ప్లాన్లు చాలా తక్కువగా ఉండటంతో వినియోగదారులు బలవంతంగా డేటా ప్లాన్లే ఎంచుకోవాల్సి వస్తోంది.
Nidigunta Aruna : పోలీసుల అదుపులో నిడిగుంట అరుణ
ఇటీవల టెలికాం సంస్థలు టారిఫ్‌లను భారీగా పెంచేశాయి. గతేడాది 25 శాతం వరకు పెరిగిన రీఛార్జ్ ధరలు ఇప్పుడు మరింత పెరిగాయి. రోజుకు 1GB డేటా ఇచ్చే ఎంట్రీ లెవెల్ ప్లాన్లను జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా ఒకదాని తర్వాత ఒకటి తొలగిస్తున్నాయి. మంగళవారం జియో తన 1GB/day ప్లాన్‌ను ఎత్తేసి, దాని స్థానంలో రోజుకు 1.5GB డేటా ఇచ్చే రూ. 299 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. దీంతో తక్కువ ఖర్చుతో వచ్చే ఎంట్రీ లెవెల్ ఆప్షన్లు పూర్తిగా తగ్గిపోయాయి.
Organ : ప్రతి 2 నెలలకు మన శరీరంలో అవయవం మారుతుందని మీకు తెలుసా..?
ఇక ఎయిర్‌టెల్ కూడా అదే బాటలో నడుస్తూ రూ. 249 ఎంట్రీ లెవెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను నిలిపివేసింది. ఈరోజు ఆగస్టు 20 నుంచి ఈ ప్లాన్ వినియోగదారులకు అందుబాటులో ఉండదు. దాని బదులుగా 28 రోజుల వ్యాలిడిటీతో 1GB/day డేటా ప్లాన్ రూ. 299కి, రోజుకు 1.5GB డేటా కోసం రూ. 349కి అందించనుంది. వొడాఫోన్-ఐడియా కూడా 1GB/day ప్లాన్‌ను రూ. 299కి అందిస్తోంది. మొత్తంగా, వినియోగదారుడి నుంచి సగటు ఆదాయాన్ని పెంచుకోవడమే ఈ కొత్త నిర్ణయాల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని టెలికాం నిపుణులు భావిస్తున్నారు.