Buffalo Raped: గేదెపై సామూహిక అత్యాచారం
గేదె నాలుగు కాళ్లను తాళ్లతో కట్టివేసి, దానిని నేలపై పడవేసి అత్యాచారం చేశారని వాపోయాడు సదరు రైతు. నాలుగు రోజుల పాటు గేదెకు ఇంజక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు.
- By Praveen Aluthuru Published Date - 11:12 PM, Wed - 17 July 24

Buffalo Raped: రోజురోజుకి మనుషులు మృగాళ్ల తయారవుతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు ఎవర్ని వదిలిపెట్టడం లేదు. సామూహిక హత్యాచారలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. తాజాగా మనవమృగాలు పశువుని కూడా వదల్లేదు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామానికి చెందిన పిల్లి సీతారామయ్య జూలై 3న తన గేదెను షెడ్డులో కట్టి ఇంటికి వెళ్లాడు. అతను గేదె నుండి పాలు తీయడానికి తిరిగి వచ్చినప్పుడు దాని శరీరం వెనుక భాగంలో కొన్ని గాయాలు కనిపించాయి. దీంతో తన గేదెపై అత్యాచారం జరిగిందని గ్రహించాడు. లైంగిక దాడి సమయంలో గేదే ప్రతిఘటించడంతో ఏర్పడిన గాయాలను గోరు గాట్లను పోలీసులకు, మీడియాకు చూపించారాయన.
గేదె నాలుగు కాళ్లను తాళ్లతో కట్టివేసి, దానిని నేలపై పడవేసి అత్యాచారం చేశారని వాపోయాడు సదరు రైతు. నాలుగు రోజుల పాటు గేదెకు ఇంజక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. అయితే ఇలాగే ఇంజెక్షన్లు ఇవ్వడం కొనసాగిస్తే పాలు రాకపోవచ్చని డాక్టర్ చెప్పినట్లు ఆ రైతు చెప్పుకొచ్చాడు. అందుకే జంతువుకు హోమియోపతి మందులు సూచించాడు అని సీతారామయ్య చెప్పారు.
Police investigating, #UnNaturalSex with a #Buffalo !
A farmer Sitaramaiah lodged a complaint to Police, alleged that his Buffalo was tied up with a rope and Raped by some inebriated persons, in #Thokalapudi village of #Veeravasaram mandal of #WestGodavari dist, #AndhraPradesh . pic.twitter.com/VR5NqPObOY
— Surya Reddy (@jsuryareddy) July 17, 2024
రాత్రిళ్లు షెడ్డు దగ్గర మద్యం, గంజాయి తాగిన కొందరు గేదెలపై అత్యాచారం చేసి ఉంటారని, గేదెను కట్టేందుకు ఉపయోగించే తాడును కూడా వేరే పశువుల కొట్టం నుంచి తీసుకొచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. వీరవాసరం సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సీతారామయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు వెటర్నరీ డాక్టర్ ద్వారా గేదెకు వైద్య పరీక్షలు చేయించారు. ఎవరైనా అసహజ నేరాలకు పాల్పడినట్లు తేలితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read: Bibi-ka-Alam: హైదరాబాద్‌లో జయప్రదంగా ముగిసిన బీబీ కా ఆలమ్ ఊరేగింపు