Phone Tapping Case : మరో బీఆర్‌ఎస్ నేతకు నోటీసులు జారీ
ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేయగా, ఆయన కూడా విచారణకు హాజరయ్యారు.
- By Latha Suma Published Date - 01:36 PM, Sat - 16 November 24
Former MLA Jaipal Yadav : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటీకే బీఆర్‌ఎస్ నేత చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలసిందే. ఇప్పుడు తాజాగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట జైపాల్ యాదవ్ విచారణకు సైతం హాజరయ్యారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేయగా, ఆయన కూడా విచారణకు హాజరయ్యారు. అయితే నోటీసులు అందుకున్న వెంటనే జైపాల్ యాదవ్ విచారణకు హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ కాగా.. రాజకీయ నాయకులు కూడా అరెస్ట్ అవుతారంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) చీఫ్ ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నారు. ఆయనను రప్పించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు పోలీసులు ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నలుగురి కాల్ డేటాలు విశ్లేషిస్తున్న అందులోని వివరాల ఆధారంగా ఒక్కొక్కరికీ నోటీసులు ఇస్తూ విచారిస్తున్నారు.
Read Also: Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..ఐదుగురు మావోయిస్టులు మృతి