21మంది పిల్లల సరుకులకు నెలకు లక్ష.. ఇంకా పిల్లలు కావాలంటున్న తల్లి..
కరెక్టే. మళ్లీ మళ్లీ చదవాల్సిన పనిలేదు. హెడ్‌లైన్ కరెక్ట్‌గానే ఉంది. మీరూ సరిగ్గానే చదివారు. ఆమె, ఆమె భర్త కలిసి నెలకు లక్షరూపాయల సరుకులు కొంటారు. 21మంది పిల్లల తల్లి. అయినా ఇంకా పిల్లలు కావాలంటోంది. అసలు స్టోరీ ఏంటి? చదవండి..
- By Dinesh Akula Published Date - 03:46 PM, Fri - 5 November 21

నెలలో ఒకసారి సూపర్‌మార్కెట్ బిల్లు చూస్తేనే మన గుండె గుబేల్ అంటుంది. ప్రతీ ఐటమ్ అవసరమా లేదా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ కొంటుంటాం. కొన్నిసార్లయితే బిల్లింగ్ దగ్గరకు వెళ్లాక కూడా ఐటమ్స్ తీసి పక్కన పడేసే సందర్భాలు మనలో చాలామందివి. అలాంటిది ఓ జంట 21మంది పిల్లల కోసం ఏకంగా నెలకు లక్షరూపాయల సూపర్‌మార్కెట్ బిల్లు చేస్తుంది.
చాలామంది మైండ్‌లో ఈపాటికి ఐడియా వచ్చే ఉంటుంది. అవును.. ఆ జంట ఇప్పటికి 21మంది పిల్లలను దత్తత తీసుకుంది. 14 ఏళ్ల క్రితం షెల్లీ, జారెడ్ అనే ఈ ఇద్దరు మంచి మనసులు కలిశాయి.వీళ్ల పెళ్లి తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇవాళ్టి రోజుకు ఈ జంటకు మొత్తం 21మంది పిల్లలు. అంటేఉ.. 19మందిని దత్తత తీసుకున్నారన్నమాట.
Also Read : కొద్దిలో సింహం ఎటాక్ మిస్, వైరల్ అవుతున్న వీడియో
ప్రతీ నెలా మొదటి ఆదివారం 21మంది పిల్లలతో కలిసి షెల్లీ, జారెడ్ సూపర్‌మార్కెట్‌కు వెళ్తారు. కుటుంబం మొత్తానికి కావాల్సిన షాపింగ్ చేస్తారు. అయితే, ప్రతీ నెల దాదాపు అటు ఇటుగా వెయ్యి పౌండ్లు.. అంటే లక్ష రూపాయల బిల్ అవుతుందని చెప్తారు వీళ్లు.21మంది ఆకలి తీర్చడమంటే మామూలు విషయం కాదంటుంది షెల్లీ. ఇంట్లో మొత్తం నాలుగు ఫ్రిడ్జ్‌లు ఉన్నాయట. ఐదు ట్రాలీలు నిండితే కానీ నెల షాపింగ్ పూర్తయినట్టు కాదట. ఒక వారానికి 60 రోల్స్ టాయిలెట్ పేపర్ ఖర్చవుతుంది. ఈ మధ్యనే ఇలా షాపింగ్ చేసిన వీడియోను తన యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసింది.
Also Read : అక్కడ పడుకోవడంతో ట్రోల్ అవుతున్న అమెరికా అధ్యక్షుడు
ఇంత ఖర్చవుతుంటే ఎవరైనా ఒక నిమిషం ఆలోచిస్తారు. కానీ.. ఈ జంట మాత్రం మరింత మంది పిల్లలను దత్తత తీసుకోవాలని కోరుకుంటోంది. ఇంక చాలా..? అని చాలామంది వాళ్లను హేళన కూడా చేస్తుంటారని చెప్తుంది. ఒకరిద్దరు పిల్లలను పెంచడమే పెద్ద టాస్క్‌గా మారిన ఈ రోజుల్లో దత్తత తీసుకున్నవాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పెంచడం చాలా గ్రేట్ కదా..! హ్యాట్సాఫ్ టు యూ షెల్లీ, జారెడ్.
Also Read : లండన్‌లో శివమణిలాంటి స్టోరీ.. బయటపడ్డ 100 ఏళ్లనాటి లవ్‌లెటర్..
Related News

Ganesh Laddu గణేష్ లడ్డూ కొట్టేసిన స్కూల్ పిల్లలు.. వీడియో వైరల్..!
Ganesh Laddu దేశం మొత్తం గణేష్ నవరాత్రి ఉత్సవాలను గణంగా జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 18న వినాయక చవితి