HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Supreme Court Angered By Police Action In Anantha Babu Driver Murder Case

అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో సుప్రీంకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం

  • Author : Vamsi Chowdary Korata Date : 20-02-2026 - 2:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Supreme Court Strong Warning To YCP MLC Anantha Babu
Supreme Court Strong Warning To YCP MLC Anantha Babu
Ananta Babu case  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో పోలీసులు ఈ కేసు విషయంలో వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు సంస్థలు, నిందితుడు ఒక్కటయ్యారు అనే రీతిలో వ్యవహరించారని మండిపడింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ.. నాటి దర్యాప్తులో పోలీసుల వైఖరిని ఎండగట్టింది. ‘‘నిందితుడితో పోలీసులు ఇప్పటికీ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇంత దారుణంగా వ్యవస్థలు నిర్వీర్యం అవుతుంటే డీజీపీ, ఎస్పీలు ఏం చేస్తున్నారు?’’ అని ధర్మాసనం నిలదీసింది.

డిఫాల్ట్ బెయిల్ కుట్ర..
నాడు వైసీపీ ఎమ్మెల్సీకి బెయిల్ వచ్చేలా ఉద్దేశపూర్వకంగానే ఛార్జిషీట్ దాఖలు చేయడంలో జాప్యం చేశారని, నిందితుడితో పోలీసులు కుమ్మక్కు అయ్యారని ఇది స్పష్టం చేస్తోందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘మీకు దర్యాప్తు చేయడం చేతకాకపోతే చెప్పండి.. కేసును సీబీఐకి అప్పగిస్తాం’’ అని ఘాటుగా హెచ్చరించింది.

ప్రస్తుత ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం
గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వంపైనా కోర్టు ప్రశ్నలు సంధించింది. ‘‘నాడు తప్పు చేసిన పోలీసు అధికారులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? బాధ్యులైన వారిని ఎందుకు వదిలేశారు?’’ అని నిలదీసింది.

‘డెడ్‌లైన్’ ఆదేశాలు..
నవంబర్ 18 లోపు ట్రయల్ కోర్టు విచారణను పూర్తి చేయాలని, కేసు విచారణ కోసం మార్చి 31 లోగా హైకోర్టు ఒక సీనియర్ జ్యుడిషియల్ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని, జాప్యానికి తావులేకుండా రోజువారీ ప్రాతిపదికన విచారణ సాగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో హైకోర్టు జోక్యం చేసుకుని అడ్డంకులు సృష్టించవద్దని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ananta Babu
  • Ananta Babu case
  • andhra pradesh politics
  • AP high court
  • CBI Investigation
  • Default bail
  • police investigation
  • Subrahmanyam murder case
  • Supreme Court
  • YSRCP MLC

Related News

Varma

Pithapuram వర్మపై టీడీపీ వేటు

2024 ఎన్నికల తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో తరచుగా వివాదాలు నెలకొంటుండడంపై టీడీపీ హైకమాండ్ దృష్టిసారించింది.. నియోజకవర్గంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలను తీవ్రంగా పరిగణించిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేస

    Latest News

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

    • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd