లండన్‌లో శివమణిలాంటి స్టోరీ.. బయటపడ్డ 100 ఏళ్లనాటి లవ్‌లెటర్..
నన్ను అర్ధరాత్రి కలువు. 14 ఏళ్ల కుర్రాడికి దొరికిన వందేళ్ల నాటి లవ్‌లెటర్‌లో రాసున్న లైన్. ఇంకా అందులో ఏం రాసుంది? మన శివమణి స్టోరీలాంటి లండన్ లవ్‌స్టోరీ మీరూ చదవండి..
- By Dinesh Akula Published Date - 12:52 PM, Fri - 22 October 21

అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలే చరిత్రని మలుపుతిప్పుతాయి అంటారు. చరిత్రని మలుపు తిప్పేంత సీన్ ఉన్న స్టోరీ కాదు కానీ.. మీరు చదవబోయేది మాత్రం ఖచ్చితంగా ఓ ఇంట్రస్టింగ్ కథే..! ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందేళ్ల క్రితం ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచిన సీక్రెట్ అఫైర్ తాలూకు బండారం ఇది.! వెరీ ఇంట్రస్టింగ్ స్టోరీ.. చదవండి..
శివమణి అనే తెలుగు సినిమాలో సముద్రం నీళ్లలో ఒక బాటిల్‌లో కొట్టుకువచ్చిన లవ్‌లెటర్ కథతో సినిమా మొత్తం నడుస్తుంది. అటూ ఇటుగా దాదాపు ఇదీ అలాంటి స్టోరీనే కానీ.. ఆ లవ్‌లెటర్ ఎవరు రాశారు? ఎవరికి రాశారు..? ఇంతకీ వాళ్లను కనిపెట్టగలిగారా లేదా అనేదే అసలు ట్విస్ట్..!
అది లండన్‌లోని వెంబ్లీ ఏరియా.. వన్ వెరీ ఫైన్ సండే. లౌకాస్ కార్నెస్ అనే కుర్రాడు తన తల్లి డాన్ కార్నెస్‌తో కలిసి ఇల్లు సర్దుతున్నాడు. హాల్, బెడ్‌రూమ్ ఇలా ఒకదాని తర్వాత ఒక క్లీనింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఇద్దరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన ఇంట్లోని వింటేజ్(పాత) టీవీ జారి కింద పడి పగిలిపోయింది. టీవీ పగలడం ఆశ్చర్యం కాదు కానీ.. అది పడిన చోటున పగిలిన టైల్స్ కింద నుంచి బయటపడిన ఓ పేపర్ ముక్కే మన స్టోరీలో అసలు విషయం.
అసలే పాత కాలం నాటి టీవీ పోతే పోయిందిలే అనుకుని ఆ పేపర్ చదవడం మొదలుపెట్టాడు. ఒకొక్క లైన్ చదువుతుంటే దాని వాల్యూ ఏంటో అర్ధమయింది. చిత్తు కాగితం అనుకున్న ఆ కుర్రాడు, అతని తల్లి.. అందులో రాసున్న మేటర్ చదివి షాక్‌కు గురయ్యారు . దాదాపు వందేళ్ల క్రితం రాసిన లవ్ లెటర్ అది. ఇది కల్పిత కథ కాదు. లండన్‌లో జరిగిన యదార్ధ సంఘటన. ఇద్దరు వ్యక్తుల మధ్య వందేళ్ల క్రితం జరిగిన సీక్రెట్ అఫైర్ తాలూకు డీటైల్స్ అన్నీ అందులో క్లియర్‌గా రాసున్నాయి. ఒక ప్రియుడు, ఒక ప్రియురాలు. వందేళ్ల నాటి లవ్‌స్టోరీ. చదువుతుంటేనే అందులో ఏం రాసుందో తెలుసుకోవాలనే ఇంట్రస్ట్ కలుగుతోంది కదా..
” ఓ నా ప్రియురాలా.. ప్రతి రోజు నన్ను చూడటానికి నువ్వు రావాలి. ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే మన ఇద్దరం వివాహితులం.వీలైతే ఫుల్ వుడ్ ట్రామ్ కార్నర్‌కు ప్రతిరోజు నువ్వు వస్తావని ఆశిస్తున్నాను. నా కోరిక నెరవేరుతుందని ఆశిస్తూ.. నీ రోనాల్డ్.. అని ఉత్తరంలో రాసుంది. “
దాదాపు వందేళ్లనాటి ఈ లవ్‌స్టోరీ ఎవరిదో తెలుసుకుందామనే ప్రయత్నం చేశారు పిల్లాడు లౌకాస్ కార్నెస్, తన తల్లి డాన్ కార్నెస్. లెటర్‌పై ఎలాంటి తేదీ రాయకపోవడంతో దాని గురించి వివరాలు తెలుసుకోవడం కాస్త కష్టంగా మారింది. ఇల్లు 1917లో కట్టింది అయినా కూడా వాళ్లు గతేడాదే అక్కడకు రావడంతో ఆ రూట్ క్లోజ్ అయిపోయింది. ఉత్తరంలోని చేతిరాత, ఉత్తరం పేపర్ సైజ్ చూసి చాలామంది అది 1920ల కాలంలోనిదని చెప్పారు.
లెటర్‌లో రాసిన ఫుల్ వుడ్ ట్రామ్ కార్నర్.. దాదాపు 80 ఏళ్ల నుంచి పనిచేయడంలేదు.. ఈ లీడ్‌తో ఉత్తరం ఖచ్చితంగా 80 ఏళ్లకంటే క్రితందనే నిర్ధారణ అయితే అయింది. ఆన్‌లైన్ ఆర్కైవ్స్‌తో రోనాల్డ్ అనే వ్యక్తిని ట్రాక్ చేయాడనికి చేసిన ప్రయత్నం కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. ఇలా కాదనుకుని వివరాలేమయినా తెలుస్తాయనే ఆశతో దాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్‌చేశాడు లౌకాస్. చాలామంది ఈ వింటేజ్ లవ్‌స్టోరీ, లవ్‌లెటర్‌ని చూసి థ్రిల్ అయ్యారు కానీ అది ఎవరు రాశారు? ఎవరికి రాశారనే వివరాలు మాత్రం తెలియలేదు. దీంతో దాన్ని ఫ్రేమ్ చేయించి తన ఇంట్లో వాల్‌కు హ్యాంగ్ చేశాడు లౌకాస్.
Related News

MLC Kavitha: కల్వకుంట్ల కవితకు లండన్ బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆహ్వానం
ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆహ్వానించింది.