అక్కడ పడుకోవడంతో ట్రోల్ అవుతున్న అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కి సంబందించిన ఓకే వీడియో వైరల్ అవుతోంది.
- Author : Hashtag U
Date : 03-11-2021 - 11:37 IST
Published By : Hashtagu Telugu Desk
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కి సంబందించిన ఓకే వీడియో వైరల్ అవుతోంది. ఒక కీలక సభ జరిగేప్పుడు బైడెన్ కునుకు తీస్తున్న వీడియోను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గ్లాస్గో వేదికగా జరిగిన కాప్ 26 ప్రపంచ నేతల సదస్సులో ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఈ వీడియోలో అతను కొంత సమయం పాటు కళ్ళు మూసుకుని కనిపించాడు. ఒక దేశాధ్యక్షుడు చేస్తున్న ప్రసంగం వింటూనే బైడెన్ నిద్రలోకి జారుకున్నాడు. వాషింగ్టన్ పోస్ట్ రిపోర్టర్ ఒకరు మొదటగా ఈ వీడియోను ట్వీట్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 50 లక్షల మంది వీక్షించారు. ప్రసంగం వింటూ బైడెన్ నిద్రపోయినట్లుగా ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో జో బైడెన్ స్పీకర్ వింటున్నట్లు కనిపిస్తున్నది. ఇంతలో అతను కళ్ళు మూసుకున్నాడు. ప్రసంగం కొనసాగుతున్నది. కొన్ని సెకండ్ల తర్వాత అతను కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకున్నాడు. ఈ 1.19 నిమిషం వీడియో క్లిప్‌లో బైడెన్ ఇలా నాలుగు సార్లు కళ్లు మూస్తూ తెరవడం కనిపిస్తుంది. బైడెన్ దగ్గరికి ఒక వ్యక్తి రావడంతో ఆ వీడియో ముగుస్తుంది. సదస్సులో ప్రసంగం ప్రారంభమైన గంట తర్వాత ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Biden appears to fall asleep during COP26 opening speeches pic.twitter.com/az8NZTWanI
— Zach Purser Brown (@zachjourno) November 1, 2021