HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Mock Drill In Pakistan Border States

Mock Drill : పాకిస్థాన్‌ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్‌ డ్రిల్‌..!

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలి? ప్రభుత్వ యంత్రాంగం ఎలా పని చేయాలి? అనే అంశాలపై అవగాహన కల్పించడమే ఈ డ్రిల్‌ ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.

  • Author : Latha Suma Date : 28-05-2025 - 4:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mock drill in Pakistan border states..!
Mock drill in Pakistan border states..!

Mock Drill : భారత ప్రభుత్వం మే 29న (రేపు)పాకిస్థాన్‌తో సరిహద్దు కలిగిన రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గుజరాత్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లోని సరిహద్దు జిల్లాల్లో ఈ డ్రిల్‌ చేపట్టనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలి? ప్రభుత్వ యంత్రాంగం ఎలా పని చేయాలి? అనే అంశాలపై అవగాహన కల్పించడమే ఈ డ్రిల్‌ ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి. ఎలాంటి ప్రమాద పరిస్థితులలోనైనా సమర్ధంగా స్పందించేందుకు పౌరులు, అధికారులు సిద్ధంగా ఉండాలని సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Read Also: Union Cabinet : కేంద్ర క్యాబినెట్‌ పలు కీలక నిర్ణయాలు ఇవే..

ఇటీవల భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో, సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తత అవసరం అని కేంద్రం భావిస్తోంది. ప్రత్యేకంగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో సరిహద్దుల్లో రక్షణ చర్యలను పటిష్టం చేయడంలో భాగంగా మాక్‌ డ్రిల్లులు నిర్వహించనున్నారు. గత మే 7న దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్‌ అభ్యాస్‌’ పేరిట విస్తృతంగా మాక్‌ డ్రిల్లులు నిర్వహించబడ్డాయి. అదేరోజు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరిట భారత సైన్యం పాకిస్థాన్‌, పీవోకే (పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌) ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. పీవోకేలోని కీలక ఉగ్రవాద కేంద్రాలు, సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.

ఈ దాడులు పాకిస్థాన్‌ వైపు నుంచి జరుగుతున్న వరుస ఉగ్రచర్యలకు భారత తక్షణ ప్రతిస్పందనగా చర్చించబడుతున్నాయి. కేంద్రం, రాష్ట్రాల పరిపాలనా వ్యవస్థలు సమిష్టిగా పనిచేసే విధంగా ఈ మాక్‌ డ్రిల్లులు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఈ మాక్‌ డ్రిల్‌ వ్యవహారంలో కేంద్రం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ప్రజల భద్రత, ఆత్మరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి డ్రిల్లులు కీలకమని అధికారులు చెబుతున్నారు. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డ్రిల్‌లో భాగస్వాములవ్వాలని ప్రభుత్వం సూచిస్తోంది.

Read Also: Rishabh Pant: రిష‌బ్ పంత్‌కు బీసీసీఐ షాక్‌.. రూ. 30 ల‌క్ష‌ల జ‌రిమానా!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Center Government
  • gujarat
  • Jammu and Kashmir
  • Mock Drill
  • Operation Abhyas
  • Pakistan border states
  • punjab
  • rajasthan

Related News

Indian-Origin YouTuber Nancy Grewal

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ హత్య

Nancy Grewal  కెనడాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఖలిస్థానీ వేర్పాటువాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించే ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రెవాల్ (45) హత్యకు గురయ్యారు. అంటారియోలోని విండ్సర్-ఎసెక్స్ ప్రాంతం పరిధిలో ఉన్న లాసెల్ టౌన్‌లోని ఆమె నివాసంలోనే ఈ ఘోరం జరిగింది. మార్చి 3న రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో నాన్సీ గ్రెవాల్‌పై కత్తితో దాడి జరిగింది. సమాచారం అందుకున్న ఎమర్జ

  • Gujarat Lift Accident

    షాకింగ్ ఘటన..వామ్మో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వ్య‌క్తి

Latest News

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

  • ఇరాన్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయా?!

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd