Center Government
-
#India
Ola-Uber : ఉబర్ , ఓలా వంటి సంస్థలకు కేంద్రం గుడ్‌న్యూస్
ఈ మార్పులతో యాప్ ఆధారిత క్యాబ్ కంపెనీలు తమ సర్వీసులు మరింత వాణిజ్యపరంగా నిర్వహించుకునే అవకాశం పొందినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మార్పుల ప్రకారం, రద్దీగల సమయాల్లో క్యాబ్ సంస్థలు తాము వసూలు చేసే బేస్ ఛార్జీలపై అదనంగా సర్‌ఛార్జీ వసూలు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Published Date - 11:18 AM, Wed - 2 July 25 -
#Telangana
Kavitha : బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి.. జూలై 17న రైల్ రోకో : ఎమ్మెల్సీ కవిత
కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, జూలై 17న రైల్ రోకో చేపట్టనున్నట్లు ఆమె వెల్లడించారు. ఇది మామూలు ఆందోళన కాదు, ఇది బీసీ సమాజం ప్రతిష్టాత్మక పోరాటం అని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల బీసీ సంఘాల భాగస్వామ్యంతో దేశవ్యాప్త స్థాయిలో ఈ ఉద్యమాన్ని విస్తరించాలన్నదే తమ లక్ష్యమని కవిత వివరించారు.
Published Date - 04:17 PM, Tue - 17 June 25 -
#India
Mock Drill : పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్..!
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలి? ప్రభుత్వ యంత్రాంగం ఎలా పని చేయాలి? అనే అంశాలపై అవగాహన కల్పించడమే ఈ డ్రిల్ ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.
Published Date - 04:22 PM, Wed - 28 May 25 -
#India
Operation Sindoor : నేడు పలు దేశాలకు భారత్ ప్రత్యేక బ్రీఫింగ్..!
ఈ సమావేశానికి యూకే సహా అనేక దేశాల రాయబారులు, రక్షణ సలహాదారులు హాజరుకానున్నారు. వీరికి ప్రత్యేకంగా సమన్లు పంపిన కేంద్రం, ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన కీలక విషయాలను వివరించే కార్యక్రమానికి సిద్ధమైంది.
Published Date - 11:40 AM, Tue - 13 May 25 -
#India
Mock drill : రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
ఈ నెల 7వ తేదీన దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించనున్నారు. మొత్తం 259 జిల్లాల్లో జరిగే ఈ డ్రిల్‌లో వైమానిక దాడులు జరిగే సమయంలో ప్రజల భద్రత కోసం ముందస్తు చర్యలు తీసుకునేలా సైరన్లు మోగించడం, ప్రజలకు, విద్యార్థులకు రక్షణ విధానాలపై శిక్షణ ఇవ్వడం వంటి అంశాలు ఉంటాయి.
Published Date - 01:49 PM, Tue - 6 May 25 -
#India
Pakistani Nationals : దేశం వీడి వెళ్లేందుకు పాకిస్థానీయుల గడువు పొడిగించిన కేంద్రం!
పాక్ జాతీయులు తిరిగి వెళ్లడానికి ఇచ్చిన గడువు మంగళవారంతో ముగిసింది. ఏప్రిల్ 30 వాఘా-అటారీ సరిహద్దును మూసివేస్తామని గతంలో కేంద్రహోం మంత్రిత్వశాఖ ఇచ్చిన ఉత్తర్వును సవరించినట్లు సమాచారం.
Published Date - 01:30 PM, Thu - 1 May 25 -
#India
Pahalgam Attack : పహల్గాం దాడి దృశ్యాలను విడుదల చేసే యోచనలో కేంద్రం..!
వాటితో పాటు గతంలో పాక్ ఉగ్రవాదులు భారత్‌లో పాల్పడిన దాడుల దృశ్యాలను బయటపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. పహల్గాం ఘటనతో భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Published Date - 12:54 PM, Wed - 30 April 25 -
#India
Pahalgam Terror Attack : పాక్‌కు ఎగుమతి చేసే ఔషధాల వివరాలను వెంటనే పంపండి: కేంద్ర ప్రభుత్వం
పాక్‌కు ఎగుమతి చేసే ఔషధాలు, ఫార్మా, ఉత్పత్తుల వివరాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ సేకరిస్తోంది. ఆ వివరాలను అత్యవసరంగా పంపాలని ఫార్మా ఎక్స్‌పోర్ట్ బాడీ ఫార్మెక్సిల్‌ను కోరింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. భారత ఫార్మా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్న 219 దేశాల్లో పాక్ 38వ స్థానంలో ఉంది.
Published Date - 11:28 AM, Tue - 29 April 25 -
#India
Supreme Court : కేంద్రంతో సహా పలు ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు
ఈ మేరకు జస్టిస్ బీఆర్ గువాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ నోటీసులు జారీ చేసింది. ఓటీటీ, సామాజిక మాధ్యమాల్లో లైంగిక అసభ్యకరమైన కంటెంట్‌ను నిషేధించేందుకు నేషనల్ కంటెంట్ కంట్రోల్ అథారిటీని ఏర్పాటుచేసి మార్గదర్శకాలు జారీ చేయాలని ఐదుగురు పిటిషనర్లు కోరారు.
Published Date - 04:40 PM, Mon - 28 April 25 -
#India
Waqf Bill : వక్ఫ్ బిల్లుపై స్టే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
వక్ఫ్ చట్టం అమలుపై తాత్కాలికంగా లేదా పూర్తిగా స్టే విధించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కేంద్రం వెల్లడించింది. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉంటాయి. వాటిపై మధ్యంతర దశలో నిషేధం విధించడం అధికారాల సమతుల్యత సూత్రానికి విరుద్ధం. అలాగే, కోర్టులకు ఇటువంటి స్టే ఇచ్చే అధికారాలు నేరుగా లేదా పరోక్షంగా చట్టాల్లో పేర్కొనబడలేదని పేర్కొంది.
Published Date - 06:00 PM, Fri - 25 April 25 -
#India
Veena Vijayan : కేరళ సీఎం కుమార్తెను విచారించేందుకు కేంద్రం అనుమతి
కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అక్రమ లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి. ఒకవేళ ఈ కేసులో వీణ దోషిగా తేలితే, ఆర్నెళ్ల నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి.
Published Date - 12:39 PM, Fri - 4 April 25 -
#India
Medicine Price : 900 రకాల మెడిసన్ ధరలను సవరించిన కేంద్రం..
పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయని జాతీయ ఔషధ ధరల అథారిటీ స్పష్టం చేసింది.
Published Date - 12:45 PM, Tue - 1 April 25 -
#India
Stalin : దక్షిణాదికి అన్యాయం.. పార్టీల అధినేతలకు సీఎం స్టాలిన్ లేఖలు
ఈ క్రమంలోనే తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఓ రేంజ్ లో నడుపుతున్న స్టాలిన్ తాజాగా దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపైనా అందర్నీ ఏకతాటిపైకి తేవాలని నిర్ణయంచుకున్నారు.
Published Date - 06:59 PM, Fri - 7 March 25 -
#India
MNM : ఇండియాను ‘హిందీయా’గా మార్చే ప్రయత్నం : కమల్ హాసన్
దక్షిణాదిపై బలవంతంగా హిందీని రుద్దేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యం, సమాఖ్యవాదం భారతదేశానికి రెండు కళ్ళు. రెండింటికీ ప్రాముఖ్యత ఇవ్వడం ద్వారా మాత్రమే మనం సమ్మిళిత, అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలను సాధించగలమని నొక్కి చెప్పారు.
Published Date - 06:00 PM, Wed - 5 March 25 -
#India
freebies : ఎన్నికల్లో ఉచిత పథకాలు.. సరైన పద్ధతి కాదు: సుప్రీంకోర్టు
ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు వీటిని ప్రకటించే పద్ధతి మంచి కాదని వ్యాఖ్యానించింది. అయితే ఉచిత పథకాలు మంచివి కావు.
Published Date - 04:09 PM, Wed - 12 February 25