Congress : జార్ఖండ్ ఎన్నికలు..రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
Congress : జార్ఖండ్ రాష్ట్రంలోనే బొకారో స్థానంలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ ఆచితూచి ప్రణాళికలు వేసినట్లనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో జార్ఖండ్ వికాస్ మోర్చా పార్టీ (జెవిఎంపి) పార్టీ అధ్యక్షులు సమరేష్ సింగ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
- By Latha Suma Published Date - 02:28 PM, Tue - 29 October 24

Jharkhand Assembly Elections : వచ్చే నెలలో జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఇండియా బ్లాక్ భాగస్వామ్య పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బొకారో, ధన్‌బాద్ నియోజకవర్గాల అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. బొకారో స్థానానికి కాంగ్రెస్ పార్టీ శ్వేతాసింగ్‌ని బరిలోకి దింపింది. అక్కడ బీజేపీ అభ్యర్థిగా బిరాంచీ నారాయణ్ పోటీ చేస్తున్నారు. ఈయన ఈ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ధన్‌బాద్ స్థానానికి అజరు దూబేని కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఈ స్థానంలో బీజేపీ నుంచి రాజ్ సిన్హా పోటీ చేస్తున్నారు. ఈయన రెండుసార్లు ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో సిన్హా కాంగ్రెస్ అభ్యర్థి మన్నన్ మాలిక్‌ని ఓడించారు.
కాగా, జార్ఖండ్ రాష్ట్రంలోనే బొకారో స్థానంలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ ఆచితూచి ప్రణాళికలు వేసినట్లనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో జార్ఖండ్ వికాస్ మోర్చా పార్టీ (జెవిఎంపి) పార్టీ అధ్యక్షులు సమరేష్ సింగ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన కోడలే శ్వేతా సింగ్. ఈమెనే బీజేపీకి ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీచేసేందుకు అవకాశం ఇచ్చింది. బొకారా, ధన్‌బాద్ నియోజవర్గాల నుంచి పోటీ చేయనున్న ఈ ఇద్దరు అభ్యర్థులు మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌లో భాగస్వామ్య పార్టీలైన జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) 41, కాంగ్రెస్ 30, ఆర్‌జెడి 6, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎంఎల్) 4 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.