Myanmar : భూకంపం తీవ్రతకు కుప్పకూలిన 1,000 పడకల ఆసుపత్రి
మయన్మార్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల భవనాలు, పాత వంతెనలు కుప్పకూలినట్లు వార్తలొస్తున్నాయి. కొత్తగా నిర్మించిన ఈ ఆసుపత్రికి ఇంకా పేరు పెట్టలేదు. ఈ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది.
- By Latha Suma Published Date - 04:38 PM, Fri - 28 March 25

Myanmar : మయన్మార్, థాయ్‌లాండ్ దేశాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ భూకంపం తీవ్రతకు మయన్మార్ రాజధాని నేపిడాలోని 1,000 పడకల ఆసుపత్రి కుప్పకూలింది. ఇక్కడ అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఓ ఆంగ్లవార్తా సంస్థ కూడా పేర్కొంది. చాలా మంది తమ ఆత్మీయుల కోసం శిథిలాల్లో గాలింపు కొనసాగిస్తున్నారు. మయన్మార్ దేశవ్యాప్తంగా చాలా చోట్ల భవనాలు, పాత వంతెనలు కుప్పకూలినట్లు వార్తలొస్తున్నాయి. కొత్తగా నిర్మించిన ఈ ఆసుపత్రికి ఇంకా పేరు పెట్టలేదు. ఈ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది.
Read Also: 10th Exams : పరీక్ష హాల్ లో తనిఖీకి వెళ్లిన అధికారిని కాటేసిన పాము
ఇక, మాండల్యా అనే ప్రదేశంలో మసీదు కూలి దాదాపు 20 మంది చనిపోగా.. టవుంగూలో పునరావాస కేంద్రం ధ్వంసమై మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మయన్మార్, థాయ్‌ల్యాండ్ సహా చైనా, భారత్, వియత్నాం తూర్పు ఆసియా దేశాల్లో 7.7, 6.4 తీవ్రతతో రెండు భూకంపాలొచ్చాయి. ఫలితంగా థాయ్‌ల్యాండ్, మయన్మార్‌లో భారీగా ఆస్తినష్టం చోటు చేసుకొంది. మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాగా, మయన్మార్‌లోని సైనిక పాలకులు అంతర్జాతీయ సమాజం సాయం చేయాలని కోరారు. ఈ మేరకు మిలటరీ జుంటా ఓ ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించింది. నేపిడాలో క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రిని మిలటరీ చీఫ్ మిన్ ఆంగ్ లయాంగ్ సందర్శించారు.
ఇక, తొలిసారి ప్రకంపనలు రాగానే బ్యాంకాక్‌లో మెట్రో సేవలను నిలిపివేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పినట్లైంది. రెండో సారి ప్రకంపనలకు ఏకాంగా మెట్రో రైళ్లు కూడా ఊగిపోయాయి. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో కూడా తీవ్ర స్థాయిలోనే భూకంపం వచ్చింది. మేఘాలయ ఈస్ట్‌గారో హిల్స్‌లో 4 తీవ్రతతో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బంగ్లాదేశ్‌లోనూ 7.3 తీవ్రతతో భూమి కంపించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆ దేశ స్టాక్ ఎక్స్ఛేంజి కార్యకలాపాలను సస్పెండ్ చేశారు. దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు. మరోవైపు భూకంపం కారణంగా బ్యాంకాక్‌లో ఇద్దరు చనిపోయారు. నగరంలో కుప్పకూలిన 30 అంతస్తుల భారీ భవనం కింద 43 మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల కోసం దీనిని నిర్మిస్తున్నారు.
Read Also:AMC Chairmen: 47 మార్కెట్ కమిటీల కు ఛైర్మెన్లను ప్రకటించిన కూటమి ప్రభుత్వం