AMC Chairmen: 47 మార్కెట్ కమిటీల కు ఛైర్మెన్లను ప్రకటించిన కూటమి ప్రభుత్వం
త్వరలోనే మిగతా మార్కెట్ కమిటీల ఛైర్మన్లను ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్ అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత వారి పేర్లను ప్రకటించింది.
- By Latha Suma Published Date - 03:34 PM, Fri - 28 March 25

AMC Chairmen: రాష్ట్రవ్యాప్తంగా 47 మార్కెట్ కమిటీల(ఏఎంసీ)కు ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. తాజాగా ప్రకటించిన 47 ఏఎంసీ ఛైర్మన్ పదవుల్లో 37 టీడీపీ , 8 జనసేన , 2 బీజేపీ నాయకులకు దక్కాయి. త్వరలోనే మిగతా మార్కెట్ కమిటీల ఛైర్మన్లను ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కార్ అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత వారి పేర్లను ప్రకటించింది. కమిటీ చైర్మన్‌గా ఎంపికైన నేతల పేర్లు వారు ఏ పార్టీకి చెందినవారు అనే విషయాన్ని కూడా కింది జాబితాలో తెలుసుకోవచ్చు..
కాగా, టీడీపీ నుంచి నామినేటెడ్ పదవుల కోసం కేవలం 60 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన పవన్, పురందేశ్వరి తో చంద్రబాబు చర్చించారు. గత ఏడాది సెప్టెంబరులో నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. 20 కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు మొత్తం 99 మందితో తొలి జాబితాను అప్పట్లో విడుదల చేశారు. రెండో విడత భర్తీ ప్రక్రియ నవంబరులో జరిగింది. 59 మందితో రెండో జాబితా విడుదలైంది. తొలి, రెండో విడతల్లో సుమారు 150 మంది నేతలకు పదవులు ఖరారు చేసారు. ఇక, ఇప్పుడు మూడో విడత నామినేటెడ్ పదవుల భర్తీ కోసం నాలుగు నెలలుగా కసరత్తు చేసారు. మూడు పార్టీలకు ప్రాధాన్యత – సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకొని జాబితా ప్రకటించారు.
Read Also: Myanmar, Bangkok : భూకంప పరిస్థితులపై మోడీ ఆరా..అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధం