HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >We Will Go To The Elections With 42 Percent Reservation Minister

42 Percent Reservation: 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం: మంత్రి

అసెంబ్లీలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టే కోర్టులో కూడా ఈ 42 శాతం రిజర్వేషన్ల చట్టానికి అనుకూలంగా బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు ఇంప్లీడ్ కావాలని ఆయన కోరారు.

  • Author : Gopichand Date : 08-10-2025 - 8:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
42 Percent Reservation
42 Percent Reservation

42 Percent Reservation: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే (42 Percent Reservation) జరుగుతాయని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చారిత్రక నిర్ణయం తీసుకుందని, దీనిపై కోర్టులో ప్రభుత్వ వాదనలు బలంగా వినిపించామని ఆయన తెలిపారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ ఎన్నికలకు వెళ్తున్న దేశంలో తొలి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ప్రకటించారు. ఇది బలహీన వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో భాగంగా తీసుకున్న గొప్ప నిర్ణయంగా ఆయన అభివర్ణించారు.

సభలో మద్దతు, కోర్టులో ఇంప్లీడ్ అవ్వాలి

ఈ రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చల గురించి మంత్రి గుర్తు చేస్తూ.. సభలో ఈ అంశంపై ఏకగ్రీవ తీర్మానం జరిగిందని చెప్పారు. “సభలో నేను మాట్లాడినప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ (బీఆర్‌ఎస్) స్పష్టంగా మద్దతు ఇచ్చారు” అని మంత్రి వెల్లడించారు. “బలహీన వర్గాల సామాజిక న్యాయం అమలు దృష్ట్యా రాజకీయాలకు పోకుండా పార్టీలన్నీ ఐక్యంగా ఉండాలి” అని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

Also Read: Curry Leaves: 30 రోజుల్లో మీ జుట్టు పెర‌గాలంటే.. కరివేపాకును ఉపయోగించండిలా!

అసెంబ్లీలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టే కోర్టులో కూడా ఈ 42 శాతం రిజర్వేషన్ల చట్టానికి అనుకూలంగా బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు ఇంప్లీడ్ కావాలని ఆయన కోరారు. “కోర్టులో కేవలం అఫిడవిట్‌లు మాత్రమే సరిపోవు. అన్ని పార్టీల మద్దతు అవసరం” అని ఆయన పేర్కొన్నారు.

ఎంపైరికల్ డేటా ఆధారంగానే చట్టం

ఈ రిజర్వేషన్ల పెంపునకు ఆధారం గురించి మంత్రి వివరిస్తూ.. “ప్రభుత్వం నిర్వహించిన కుల సర్వేలో మీరు (విపక్షాలు) పాల్గొనలేదు. అయినప్పటికీ ప్రజలు 97 శాతం మంది ఈ సర్వేలో పాల్గొన్నారు” అని తెలిపారు. “ఎంపైరికల్ డేటాకు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ వేసి, ఆపై సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని, 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసుకున్నాం. ఇది పకడ్బందీగా జరిగింది. బీసీలకు న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వం పోరాడుతుంది” అని మంత్రి పొన్నం ప్రభాకర్ గట్టిగా చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ తాజా నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 42 percent reservation
  • hyderabad
  • Minister Ponnam
  • Sarpanch Elections
  • telangana

Related News

Live In Relationship Hyd

హైదరాబాద్‌లో పెరిగిపోతున్న మైనర్లు ‘సహజీవనం’ కల్చర్

హైదరాబాద్‌లో వెలుగులోకీ వచ్చిన ఇద్దరు మైనర్లు సహజీవనం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన 16 ఏళ్ల యువతీ , యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పదో తరగతిలో ఉన్నప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది

  • Aasara Pension

    ఎట్టకేలకు ఆసరా పింఛన్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు

  • CM Revanth- Uttam

    పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో పోరాటానికి తెలంగాణ సిద్ధం!

  • Municipal Elections

    తెలంగాణ లో ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్?

  • Two Child Policy Continue

    స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత సరైనదేనా?

Latest News

  • తెలంగాణ మంత్రి సీతక్కకు కీలక బాధ్యతలు

  • శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వును ఎలా తగ్గించుకోవాలో తెలుసా..

  • అభిమానులు పై ఫైర్ అయిన రోహిత్ శర్మ.. వీడియో ఇదిగో!

  • మన శంకర వర ప్రసాద్ ప్రాజెక్ట్‌పై షాకింగ్ అప్‌డేట్.. ?

  • ఏపీలో పేద విద్యార్థుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్

Trending News

    • షాకింగ్‌.. జొమాటో నుండి ప్రతి నెలా 5,000 మంది తొలగింపు!

    • బంగ్లాదేశ్ సంచలన ప్రకటన.. ఐసీసీకి లేఖ‌!

    • చారిత్రాత్మక రికార్డు.. ఒకే ఓవర్‌లో 48 పరుగులు!

    • ఆపరేషన్ అబ్సల్యూట్-రిజాల్వ్.. మదురో అరెస్ట్ వెనుక ఉన్న అసలు కథ ఇదే!

    • పీఎం కిసాన్ 22వ విడత అప్డేట్‌.. ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd