Curry Leaves: 30 రోజుల్లో మీ జుట్టు పెరగాలంటే.. కరివేపాకును ఉపయోగించండిలా!
జుట్టు పెంచడానికి కరివేపాకులను తలకు కూడా పట్టించవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో కొబ్బరి నూనె తీసుకుని, అందులో గుప్పెడు కరివేపాకు వేయాలి. కరివేపాకు చిటపటలాడి, ఉడికి నల్లబడటం ప్రారంభించిన తర్వాత మంట ఆపివేయాలి.
- By Gopichand Published Date - 07:05 PM, Wed - 8 October 25

Curry Leaves: జుట్టు పెరుగుదలను ప్రేరేపించడంలో కరివేపాకు (Curry Leaves) చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని న్యూట్రిషనిస్ట్‌లు పేర్కొన్నారు. ముఖ్యంగా మీ జుట్టు బాగా రాలిపోతుంటే కొత్త జుట్టు పెంచడానికి మీరు కరివేపాకును ఉపయోగించవచ్చు. కరివేపాకులో జింక్, ఫాస్పరస్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం వంటి సూక్ష్మపోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరగడానికి సహాయపడతాయి. కాబట్టి కరివేపాకును సప్లిమెంట్ల మాదిరిగా తీసుకోవచ్చు. వీటిని మజ్జిగ లేదా సత్తు (వేయించిన శనగపిండి)తో కలిపి తీసుకుంటే జుట్టుకు ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. కరివేపాకును తినడానికి న్యూట్రిషనిస్ట్‌లు పలు సూచనలు చేశారు.
కరివేపాకు డ్రింక్ రెసిపీ
కొంచెం పెరుగు, కొద్దిగా నీరు దాదాపు 20 కరివేపాకు ఆకులు, అలాగే ఒక చెంచా వేయించిన శనగపిండి సత్తు తీసుకుని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. సత్తు జుట్టుకు అదనపు ప్రోటీన్‌ను అందిస్తుంది. ఈ తయారుచేసిన మిశ్రమాన్ని వడకట్టకుండా మొత్తం తాగేయాలి. సుమారు 200 మి.లీ తయారుచేసుకోవాలి. ఈ డ్రింక్‌ను 30 రోజుల పాటు రోజుకు ఒకసారి తాగితే జుట్టుపై ప్రభావం కనిపిస్తుంది.
Also Read: IND vs AUS: ఆస్ట్రేలియా సిరీస్.. కోహ్లీ, రోహిత్‌తో సహా టీమిండియా ఆ రోజునే బయలుదేరనుంది!
కరివేపాకును పచ్చిగా కూడా నమలవచ్చు
ప్రతిరోజూ ఉదయం కరివేపాకులను పచ్చిగా కూడా నమలవచ్చు. మీరు 12 నుండి 15 కరివేపాకు ఆకులను శుభ్రం చేసి బాగా నమలవచ్చు. ఈ ఆకుల ప్రయోజనాలు జుట్టుకే కాకుండా మొత్తం శరీరానికి లభిస్తాయి.
తలకు కూడా కరివేపాకును అప్లై చేయవచ్చు
జుట్టు పెంచడానికి కరివేపాకులను తలకు కూడా పట్టించవచ్చు. దీని కోసం ఒక గిన్నెలో కొబ్బరి నూనె తీసుకుని, అందులో గుప్పెడు కరివేపాకు వేయాలి. కరివేపాకు చిటపటలాడి, ఉడికి నల్లబడటం ప్రారంభించిన తర్వాత మంట ఆపివేయాలి. ఈ గోరువెచ్చని నూనెతో తలపై మసాజ్ చేయాలి. జుట్టు వేర్ల (Roots) నుండి చివర్ల వరకు ఈ నూనెతో మసాజ్ చేయవచ్చు. దీనిని వారానికి రెండుసార్లు ఉపయోగించినట్లయితే ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది.