HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tspsc To Reschedule All Exams Report

TSPSC Exams Reschedule: టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ రీషెడ్యూల్..?

టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రీషెడ్యూల్ (TSPSC Exams Reschedule) చేసినట్లు తెలుస్తోంది.

  • Author : Gopi Date : 12-12-2023 - 8:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TSPSC Exams Reschedule
Tspsc

TSPSC Exams Reschedule: టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రీషెడ్యూల్ (TSPSC Exams Reschedule) చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే పరీక్షల నిర్వహణ తేదీలను కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ చేసేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెరుగుతున్న నిరుద్యోగంపై ఆందోళన చెందుతోందని, అందుకే ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించిన పరీక్షలు ప్రశ్నాపత్రం లీకేజీలు, వివాదాలతో రాష్ట్రం అట్టుడికిన విషయం తెలిసిందే.

నివేదికల ప్రకారం.. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అన్ని పోటీ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది.

Also Read: TSPSC : టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ప్రొఫెసర్ కోదండరామ్..?

ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్‌పీఎస్సీ చైర్మన్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషన్‌ను వేధిస్తున్న కీలక అంశాలపై ఆయన చర్చించినట్లు సమాచారం. ఉద్యోగాల ఖాళీలు, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కార్యాచరణ ప్రణాళికపై సవివరమైన నివేదికను సిద్ధం చేయాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి కోరినట్లు సమాచారం. అన్ని TSPSC పరీక్షలను రీషెడ్యూల్ చేయడంపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే చర్చలపై ఇంకా అధికారిక ధృవీకరణ రాలేదు. సీఎం రేవంత్ తో సమీక్షా సమావేశం తర్వాత టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • congress
  • Exams Reschedule
  • hyderabad
  • telangana
  • TSPSC
  • TSPSC Examinations
  • TSPSC Exams Reschedule

Related News

Engineering counselling in Telangana begins today.

TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

తెలంగాణలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ టీజీ ఎప్‌సెట్ 2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 19వ తేదీ శుక్రవారం అంటే ఈరోజు నుంచే అధికారికంగా ప్రారంభమైంది. ఇంజినీరింగ్ సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులు ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని బట్టి ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుక

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

Latest News

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

  • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd