khammam : పువ్వాడ .. తుమ్మల మధ్య మాటల తూటాలు..
తుమ్మలపై మంత్రి పువ్వాడ తీవ్రంగా ధ్వజమెత్తారు. సీనియర్ నాయకుడినని చెప్పుకునే తుమ్మల దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు
- Author : Sudheer
Date : 07-11-2023 - 8:49 IST
Published By : Hashtagu Telugu Desk
అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ – కాంగ్రెస్ నేతల () మధ్య విమర్శలు , ప్రతివిమర్శలు , కౌంటర్లు నడుస్తున్నాయి. ఇక ఖమ్మం బరిలో నిల్చున్న తుమ్మల – పువ్వాడ (Thummala Nageswara rao vs Puvvada) మధ్య రోజు రోజుకు మరింత ముదురుతున్నాయి. మాటల తూటాలతో బస్తీమే సవాల్ అంటూ నేతలు కత్తులు దూస్తున్నారు.
ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల దొంగ ఓట్ల వ్యవహారంపై ఈసీకి ఫిర్యాదు చేయడం ఇక్కడి రాజకీయం మరింత రంజుగా మారింది. తుమ్మలపై మంత్రి పువ్వాడ తీవ్రంగా ధ్వజమెత్తారు. సీనియర్ నాయకుడినని చెప్పుకునే తుమ్మల దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. తుమ్మలకు ఓటు వేసే వారికే ఓటు ఉండాలా అని ప్రశ్నించిన పువ్వాడ.. కక్షపూరితంగానే మమత కళాశాలల విద్యార్థుల ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశారని విమర్శించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె ఖమ్మం లోని 28వ డివిజన్ కార్పొరేటర్ గజ్జల విజయలక్ష్మి, వెంకన్న బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఖమ్మం నగరంలో 60 డివిజన్లు ఉండగా దాదాపు 40 స్థానాల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో నగరంలోని కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడం గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. మరికొందరు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరతారన్న ప్రచారంతో ఖమ్మంలో రాజకీయం బాగా వేడెక్కింది.
Read Also : Telangana: విద్యుత్ విషయంలో కిషన్ రెడ్డికి కవిత కౌంటర్