HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >They Are The First Priority In Indirammas Houses Cm Revanths Key Orders

Indiramma House: ఇందిర‌మ్మ ఇళ్ల‌లో తొలి ప్రాధాన్యం వారికే.. సీఎం రేవంత్ కీల‌క ఆదేశాలు!

తొలి ద‌శ‌లో సొంత స్థ‌లాలున్న వారికే ప్రాధాన్య‌మిస్తున్నందున త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ఈ విష‌యంలో గ్రామ కార్య‌ద‌ర్శితో పాటు మండ‌ల స్థాయి అధికారుల‌ను బాధ్యుల‌ను చేయ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన సాంకేతిక‌త‌ను వినియోగించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

  • Author : Gopi Date : 29-11-2024 - 7:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indiramma House
Indiramma House

Indiramma House: తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం దివ్యాంగులు, వ్య‌వ‌సాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికుల‌కు పెద్ద‌పీట వేసిన విష‌యం తెలిసిందే. పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బ‌లోపేతం చేయ‌నుంది. ల‌బ్ధిదారు ఆస‌క్తి చూపితే అద‌న‌పు గ‌దుల నిర్మాణానికి అనుమ‌తి ఇస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇందిర‌మ్మ ఇళ్ల (Indiramma House) మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు తొలి ప్రాధాన్యం ఇవ్వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్య‌వ‌సాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్య‌క్ర‌మం ఎంచుకోవాల‌ని సీఎం తెలిపారు. ఇందిర‌మ్మ ఇళ్లపై త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం సాయంత్రం స‌మీక్ష నిర్వ‌హించారు.

Also Read: Lagacharla Notification: లగచర్ల నోటిఫికేషన్ రద్దు.. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల స్పంద‌న ఇదే!

తొలి ద‌శ‌లో సొంత స్థ‌లాలున్న వారికే ప్రాధాన్య‌మిస్తున్నందున త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని, ఈ విష‌యంలో గ్రామ కార్య‌ద‌ర్శితో పాటు మండ‌ల స్థాయి అధికారుల‌ను బాధ్యుల‌ను చేయ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన సాంకేతిక‌త‌ను వినియోగించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. ఇందిర‌మ్మ ఇళ్ల మొబైల్ యాప్ లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాల‌ని.. ఏ ద‌శ‌లోనూ ల‌బ్ధిదారుకు ఇబ్బంది క‌ల‌గ‌వ‌ద్ద‌ని.. అదే స‌మ‌యంలో శాఖ‌ప‌రంగా ఎటువంటి పొర‌పాట్ల‌కు తావివ్వ‌కుండా చూడాల‌ని సీఎం ఆదేశించారు.

ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల ప‌రిధిలో ఇందిర‌మ్మ ఇళ్ల‌కు సంబంధించి ప్ర‌త్యేక కోటా ఇచ్చేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం సూచించారు. ఇందిర‌మ్మ ఇళ్ల‌కు అద‌నంగా గ‌దులు నిర్మించుకునేందుకు ల‌బ్ధిదారులు ఆస‌క్తి చూపితే అందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు స్ప‌ష్టం చేశారు. ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కం స‌మ‌ర్థమంతంగా కొన‌సాగించేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ బ‌లోపేతం కావాల‌ని, ఇందుకు అవ‌స‌ర‌మైన అధికారులు, సిబ్బందిని నియ‌మించుకోవాల‌ని శాఖ ఉన్న‌తాధికారుల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. స‌మీక్ష‌లో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, ముఖ్య‌మంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌టరీ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ జ్యోతి బుద్ధ‌ప్ర‌కాష్, ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి వి.పి.గౌత‌మ్, త‌దిత‌రులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • congress
  • Congress Sarkar
  • Indiramma Houses
  • Revanth Good News
  • telangana
  • telangana politics
  • telugu news

Related News

Telangana Liquor Prices hike

Telangana: మందుబాబులకు షాక్.. భారీగా పెరగనున్న మద్యం, బీర్ల ధరలు

మద్యం ప్రియులకు బిగ్ షాక్. ప్రధాన బ్రాండ్ల ధరలు పెరగబోతున్నాయి. వేసవిలో పెరుగుతున్న వేడిమి కారణంగా బీర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇరాన్ యుద్ధ ప్రభావం మద్యం తయారీ పైనా పడింది. దీంతో తయారీ కంపెనీలు ధరల పెంపుపై ప్రతిపాదనలు అందించాయి. యుద్ధం కొనసాగితే తమపై ఉత్పత్తి భారం పెరుగుతుందని.. ధరలు పెంచక తప్పదని తేల్చి చెప్పాయి. దీంతో, ఎక్కువగా వినియోగించే బ్రాండెడ్ మద్యం ధరలు పె

  • Richest Ministers

    టాప్-10 రిచెస్ట్ మినిస్ట‌ర్స్‌.. తెలంగాణ‌, ఏపీ నుంచే ఆరుగురు!

  • Harish Rao

    Harish Rao: కేసీఆర్ ఆఫీసు మీద దాడి.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్

  • Telangana Cabinet

    త్వరలో మంత్రివర్గ విస్తరణ.. రేవంత్ సర్కార్ కీల‌క నిర్ణ‌యం!

  • Meeseva

    Mee-Seva Charges Hike : సామాన్యులపై పెను భారం వేసిన తెలంగాణ ప్రభుత్వం

Latest News

  • Cricket : ఒక్క రన్ ప్రాణం పోయేలా చేసింది !!

  • Telangana Govt School : ప్రభుత్వ స్కూల్స్ లలో యూకేజీ తరగతులు

  • Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గొప్ప శుభవార్త

  • BSNL బంపర్ ఆఫర్.. 1 రూపాయికే అన్‌లిమిటెడ్ కాల్స్

  • Rakasa Day 4 Collections: ‘రాకాస’ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd