Telangana : వారసత్వ రాజకీయాలు చేయడమే కాంగ్రెస్ ట్రాక్ రికార్డు – మోడీ
జూన్ 4న త్రిపుల్ తలాఖ్, సీఏఏ, ఆర్టికల్ 370ని వ్యతిరేకించిన వారు ఓడిపోక తప్పదని మోడీ అన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వద్దని ప్రజలు నిశ్చయించుకున్నారని, బీజేపీని గెలిపించుకోవాలని ప్రజలు కృత నిశ్చయంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు
- Author : Sudheer
Date : 10-05-2024 - 8:26 IST
Published By : Hashtagu Telugu Desk
దేశాన్ని లూటీ చేయడం, వారసత్వ రాజకీయాలు చేయడమే కాంగ్రెస్ (Congress) ట్రాక్ రికార్డు అని..రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS), ఎంఐఎం (AIMIM) వద్దని ప్రజలు నిశ్చయించుకున్నారని, బీజేపీని గెలిపించుకోవాలని ప్రజలు కృత నిశ్చయంతో ఉన్నారని LB స్టేడియం లో ఏర్పాటు చేసిన బిజెపి భారీ బహిరంగ సభలో పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం రేపటితో ముగుస్తున్న తరుణంలో తెలంగాణ లో ప్రధాని మోడీ వరుస పర్యటనలతో బిజీ బిజీ గా పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం నారాయణపేట, హైదరాబాద్ లో పర్యటించారు.
హైదరాబాద్ లోని LB నగర్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న మోడీ…కాంగ్రెస్ , బిఆర్ఎస్ విమర్శలు కురిపించారు. జూన్ 4న దేశం గెలుస్తుందని.. 140 కోట్ల ప్రజల సంకల్పం గెలుస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ 4న త్రిపుల్ తలాఖ్, సీఏఏ, ఆర్టికల్ 370ని వ్యతిరేకించిన వారు ఓడిపోక తప్పదని మోడీ అన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వద్దని ప్రజలు నిశ్చయించుకున్నారని, బీజేపీని గెలిపించుకోవాలని ప్రజలు కృత నిశ్చయంతో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు భారత్ డిజిటల్ రంగం, అంకుర సంస్థల్లో సూపర్ పవర్‌గా నిలిచిందని మోడీ పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలు చేయడం కాంగ్రెస్ ట్రాక్ రికార్డుగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో నగరంలో ఎన్నోచోట్ల బాంబు పేలుళ్లు జరిగాయని, దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా గుడి వద్ద బాంబు పేలుడు జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఎక్కడికెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఉండేదని, గత పదేళ్ల కాలంలో అలాంటి పరిస్థితిని చూశారా? అని ప్రశ్నించారు. ఈ బాంబ్ బ్లాస్ట్ లు ఎవరు ఆపారు? ఈ బాంబ్ బ్లాస్ట్ లు ఘనత మాది’’ అని మోడీ చెప్పుకొచ్చారు.
మధ్య తరగతి ప్రజల గురించి కాంగ్రెస్ ఏమాత్రం పట్టించుకోదని , దేశాన్ని విభజించి పాలించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ రాకుమారుడి గురువు మనల్ని ఆఫ్రికన్లు అని మాట్లాడారని, శ్రీ రామనవమి జరుపుకోవడం కూడా తప్పే అన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అహింసో పరమో ధర్మో అనేది ఇండియా సిద్ధాంతమని, వసుధైక కుటుంబం, బుద్ధం శరణం, గచ్చామి, ప్రజా సేవే భగవాన్ సేవ, వేల సంవత్సరాల సంస్కృతి రక్షణే ఇండియా అసలైన సిద్ధాంతమని మోడీ పునరుద్ఘాటించారు.
Read Also : Kannappa : కన్నప్ప నాలుగు రోజుల షూటింగ్‌కి అక్షయ్ అన్ని కోట్లు తీసుకున్నాడా..? ఈ లెక్కలో ప్రభాస్..!