Telangana : రాష్ట్రవ్యాప్తంగా 1000 ప్రీ ప్రైమరీ పాఠశాలలు.. మార్గదర్శకాలు విడుదల
Telangana : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అమలు దిశగా కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తృతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.
- By Kavya Krishna Published Date - 12:03 PM, Sun - 27 July 25

Telangana : తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య అమలు దిశగా కీలక అడుగులు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని విస్తృతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. మొత్తం 1000 పాఠశాలలను ప్రీ ప్రైమరీ విద్య కోసం ఎంపిక చేయగా, మొదటి విడతలో 210 పాఠశాలల్లో తరగతులు ప్రారంభించమని సూచించింది. తాజాగా మరో 790 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేక జాబితాను విడుదల చేయడమే కాకుండా, అవసరమైన వసతుల కోసం రూ.33 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇందులో రూ.22.62 కోట్లు టీజీఈడబ్ల్యూఐడీసీ (Telangana Government Educational and Welfare Infrastructure Development Corporation)లో వినియోగించని నిధుల నుండి తీసుకోవాలని, మిగిలిన మొత్తాన్ని సమగ్ర శిక్షా కార్యక్రమం నుంచి విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ మార్గదర్శకాల ప్రకారం, ప్రీ ప్రైమరీ తరగతులు చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా ప్రత్యేక తరగతి గదులు కేటాయించనున్నారు. ఈ తరగతుల్లో చేరే పిల్లలకు అంగన్‌వాడీల మాదిరిగా స్నాక్స్, మధ్యాహ్న భోజనం, పోషకాహారం అందించనున్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతిలో చేరబోయే నాలుగేళ్లు నిండిన చిన్నారులు మాత్రమే ప్రీ ప్రైమరీలో ప్రవేశం పొందుతారు. ఈ ప్రవేశాలకు సంబంధించిన వివరాలను యూడైస్ (UDISE) డేటాబేస్‌లో నమోదు చేస్తారు.
ప్రతి ప్రీ ప్రైమరీ తరగతిని నిర్వహించడానికి ఒక టీచర్ మరియు ఒక ఆయాను తాత్కాలిక పద్ధతిలో నియమించనున్నారు. టీచర్‌కి కనీస అర్హతగా ఇంటర్మీడియెట్ పూర్తి చేయాలి. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఆయాకు కనీస అర్హతగా 7వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. ఈ నియామకాల్లో స్థానిక గ్రామ నివాసులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. గ్రామంలో అర్హులు లేని పరిస్థితిలో మండల స్థాయి నుండి ఎంపిక చేస్తారు. నియామకం 10 నెలలపాటు మాత్రమే అమల్లో ఉంటుంది. నియామక ప్రక్రియ మొత్తం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే కమిటీ పర్యవేక్షణలో పూర్తవుతుంది.
Indian Spermtech :బయటపడ్డ మరో బాగోతం.. పో*ర్న్ వీడియోలు చూపించి స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్న వైనం
ప్రీ ప్రైమరీ తరగతుల బోధన, పాఠ్యాంశాల రూపకల్పన ఎన్‌ఈపీ-2020 (NEP-2020) మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది. తరగతి గదిలో ఇండోర్, అవుట్‌డోర్ క్రీడా సామగ్రిని ఏర్పాటు చేసి చిన్నారులకు వినోదాత్మకంగా బోధన అందించేందుకు చర్యలు తీసుకుంటారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆమోదంతో పాఠశాలల్లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తారు. రోజువారీ హాజరు పర్యవేక్షణ, ఆరోగ్య పరీక్షలు, పోషకాహారం పంపిణీ వంటి అన్ని అంశాలను ప్రధానోపాధ్యాయులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు.
అదనంగా, ఈ ప్రాజెక్ట్ అమలు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యశాఖల సమన్వయంతో జరుగుతుంది. సరఫరాలు, వస్తువులు, సామగ్రి కొనుగోలు వంటి అంశాలు జిల్లా స్థాయి కమిటీ ఆమోదంతోనే జరుగుతాయి. తల్లిదండ్రుల సూచనలు, స్థానికుల సహకారం తీసుకోవడం ద్వారా ప్రీ ప్రైమరీ తరగతులను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడతారు.
Sec-bad Test Tube Baby Center : ఆ వీడియోలు చూపిస్తూ స్పెర్మ్ సేకరణ