Revanth: రేవంత్ పై ఆసత్య ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు!
సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) 'తెలంగాణ సామాజిక పార్టీ' పెడుతున్నట్లు జర్నలిస్టు శంకర్ పేరు మీద ట్విటర్ ద్వారా ట్వీట్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది.
- Author : Gopichand
Date : 27-12-2022 - 8:26 IST
Published By : Hashtagu Telugu Desk
సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ‘తెలంగాణ సామాజిక పార్టీ’ పెడుతున్నట్లు జర్నలిస్టు శంకర్ పేరు మీద ట్విటర్ ద్వారా ట్వీట్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. కాంగ్రెస్ పార్టీపైన, నాయకులపైన దుష్ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఛైర్మన్ ప్రీతం, కొంపల్లి 5వ వార్డు కౌన్సిలర్ శ్రీవిద్య ప్రశాంత్గౌడ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.