HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Our Ancestors Made A Terrible Mistake Sorry Vijayendra Prasad

మా పూర్వీకులు భయంకరమైన తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్‌

  • Author : Vamsi Chowdary Korata Date : 18-02-2026 - 11:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayendra Prasad
Vijayendra Prasad

Vijayendra Prasad  తమ పూర్వీకులు భయంకరమైన దారుణాలు చేశారని ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కీలక వాఖ్యలు చేశారు. రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆయన.. అంటరానితనం పేరుతో నోటితో చెప్పలేని దారుణాలకు పాల్పిడినట్లు తెలిపారు. ప్రస్తుతం తనకు తెలిసి ఏ తప్పు చేయలేదని.. గతంలో తమ వాళ్లు చేసిన పనికి క్షమించాలని కోరారు.

  • మా పూర్వీకులు సంపన్నులు
  • అంటరానితనం పేరుతో దారుణాలు చేశారు
  • అందర్ని క్షమించమని అడుగుతున్నా: విజయేంద్ర ప్రసాద్

ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం (ఫిబ్రవరి 17) రాత్రి హైదరాబాద్ రవీంద్రభారతిలో మాతా రాంబాయి అంబేడ్కర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మాతా రాంబాయి అంబేడ్కర్‌ స్మారక పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొని ప్రసగించారు. తమ పూర్వీకులు సంపన్న కుటుంబానికి చెందిన వారని.. వారు అంటరానితనం పేరుతో నోటితో చెప్పటానికి వీల్లేని భయంకరమైన దారుణాలు చేశారన్నారు. అయితే తనకు తెలిసీ ఎప్పుడూ తప్పు చేయాలేదని వ్యాఖ్యనించారు. అప్పటి పరిస్థితులను తలుచుకుంటే మనసు సిగ్గుతో చచ్చిపోతుందని.. అవమానంతో కుంగిపోతుందని.. అందరికీ తలవంచి నమస్కరిస్తున్నానని అన్నారు. తమ పూర్వీకులు చేసిన తప్పుకు క్షమించాలని వేడుకున్నారు.

అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ప్రస్తుతం తన కార్యాలయంలో మహనీయుడు అంబేడ్కర్‌ చిత్రం మాత్రమే ఉంటుందని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై ఒక సినిమా కథ రాస్తున్నానని.. ప్రస్తుతం దానిపై పరిశోధన చేస్తున్నాట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ పాట పాడి సభకు వచ్చిన వారిని ఉత్సాహపరిచారు. ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలామా.. పోరు తెలంగాణమా’ అంటూ ఆయన ప్రజా యుద్ధ నౌక గద్దర్‌ పాటను పాడారు. కాగా, విజయేంద్ర ప్రసాద్ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తండ్రి అన్న విషయం తెలిసిందే. రాజమౌళి సినిమాలకు దాదాపు అన్నింటికీ విజయేంద్ర ప్రసాద్ కథలు అందిస్తారు. ప్రధాన కథాంశాన్ని తండ్రి ఇస్తే, రాజమౌళి దానిని అద్భుతమైన స్క్రీన్‌ప్లే, సన్నివేశాలుగా మలచుకుంటారు. మగధీర, బాహుబలి, మగధీర వంటి చిత్రాల విజయాల వెనుక ఈ కాంబినేషన్ కీలక పాత్ర పోషించింది.

ఇక మాతా రాంబాయి అంబేడ్కర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ కార్యక్రమ నిర్వాహకురాలు బీఎన్‌ రత్న సారథ్యంలో గద్దర్‌ సతీమణి విమల గద్దర్, ఐఆర్‌టీఎస్‌ అధికారి భరత్‌ భూషణ్‌ సతీమణి అప్పికట్ల నళిని, మాస్టార్జీ సతీమణి గంగాధరి ప్రమీల, మంత్రి వివేక్‌ సతీమణి గడ్డం సరోజ, మల్లేపల్లి లక్ష్మయ్య సతీమణి మల్లేపల్లి జయ, నిర్మాత బొమ్మకు మురళీ సతీమణి హిమమాల బొమ్మ, జేబీ రాజు సతీమణి ఆకాశపు అచ్చమాంబలకు మాతా రాంబాయి అంబేడ్కర్‌ స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ కళాకారిణి విమలక్క, సాంస్కృతిక సారథి ఛైర్‌పర్సన్‌ వెన్నెల గద్దర్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Film Writer Vijayendra Prasad
  • hyderabad
  • Mata Ramabai Ambedkar Memorial Awards
  • tollywood
  • Vijayendra Prasad

Related News

Faria Abdullah's Shocking Comments on Marriage

Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా తాజాగా పెళ్లి, ప్రేమపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె దృష్టిలో ప్రేమ ఒక అద్భుతమైన అనుభూతి అని, కానీ పెళ్లి అనేది వ్యక్తిని మార్చే ప్రక్రియ అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత తరం పెళ్లిపై ఆసక్తి కోల్పోతోందని, భవిష్యత్తులో ఈ వ్యవస్థ అర్థమే మారిపోవచ్చని ఆమె సంచలన విశ్లేషణ చేశారు. ఒకవేళ తాను నటి కాకపోయి ఉంటే షెఫ్ లేదా ఈవె

  • International Thalassemia Day

    Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

  • Retired IPS Officer Wife Incident in Jubilee Hills

    Hyderabad: జూబ్లీహిల్స్ లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య

  • Legendary producer R. B. Choudary has passed away

    Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

  • Fauji Movie

    Fauzi: ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో.. ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

Latest News

  • Trisha: ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు.. త్రిష పోస్ట్ వైరల్..!

  • Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

  • PM Modi: బంగారం కొనొద్దు.. అసలు కారణాలు ఏంటో తెలుసా…?

  • Pm Modi: బంగారం కొనడం ఆపేయండి.. ప్రధాని మోదీ విజ్ఞప్తి…

  • Tamil Politics: విజయ్ ప్రమాణ స్వీకారంలో వివాదం ?

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd