Indiramma Committees: త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు.. కమిటీలో సభ్యుడికి రూ. 6 వేల జీతం..!
- Author : Gopichand
Date : 11-04-2024 - 4:30 IST
Published By : Hashtagu Telugu Desk
Indiramma Committees: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీల హామీల అమలుకు సీఎం రేవంత్ కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళ్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేవిధంగా ఇందిరమ్మ కమిటీలు (Indiramma Committees) వేస్తామని ప్రకటించారు. ప్రతి కమిటీ సభ్యుడికి రూ. 6 వేల గౌరవ వేతనం అందిస్తామన్నారు. త్వరలోనే దీనిపై కార్యాచరణ ప్రారంభిస్తామని వెల్లడించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించేందుకు త్వరలో ఇందిరమ్మ కమిటీలు వేస్తాం. కమిటీ సభ్యులు చెప్పే వారికే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి.. ఇందిరమ్మ కమిటీలో ఒక్కో సభ్యుడికి 6 వేలు జీతం ఇస్తాం. ఎంపీ ఎన్నికలు అయిపోయిన వెంటనే జూన్ మొదటవారంలో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి.
Also Read: Chandrababu: తండ్రి లేని బిడ్డగా వచ్చి, తండ్రిని చంపి గెలిచిన జగన్
జూన్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. జూన్ చివరి వారంలోనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించే ప్రణాళికలు రూపొందిస్తున్నామని భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పై సమీక్షలో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలు పూర్తైతే మిగతా నాలుగు సంవత్సరాలు అభివృద్ధిపై దృష్టిపెట్టొచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో భారీగా చేరికలు జరిగాయి. తాజాగా బుధవారం తన నివాసంలో మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్, 11 మంది కౌన్సిలర్లకు కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు.
We’re now on WhatsApp : Click to Join