HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Full Speech At Nidadavole Public Meeting

Chandrababu: తండ్రి లేని బిడ్డగా వచ్చి, తండ్రిని చంపి గెలిచిన జగన్

ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి కూటమి రోడ్ షో నిర్వహించింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఉమ్మడిగా నిర్వహించిన రోడ్‌షోలు, బహిరంగ సభలకు జనాలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ రోడ్ షోకి భారీగా జనం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు

  • Author : Praveen Aluthuru Date : 10-04-2024 - 11:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu
Chandrababu

Chandrababu: ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి కూటమి రోడ్ షో నిర్వహించింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఉమ్మడిగా నిర్వహించిన రోడ్‌షోలు, బహిరంగ సభలకు జనాలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటించారు. ఈ రోడ్ షోకి భారీగా జనం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు. నలభై ఏళ్లలో ఇంత ఉత్సాహాన్ని ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో జనసంద్రాన్ని చూస్తేనే అర్ధం అవుతుందని అన్నారు. ఇప్పటికే ఓటర్లు తేల్చి చెప్పినట్లు అర్థమవుతోందన్నారు. జగన్ సిద్దం అంటూ సభలు పెట్టుకుని తిరుగుతున్నారని, అయితే తనను ఓడించేందుకు ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు చంద్రబాబు.

పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటేనని చెప్పిన ఆయన, ఈ మూడు పార్టీల గుర్తులకు ప్రజలు ఓటేయాలని కోరారు. గుర్తుతో సంబంధం లేకుండా మూడు పార్టీల అభిమానులు కలిసి ఓటు వేసి చారిత్రత్మక విజయాన్ని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహాకూటమి విజయం రాష్ట్ర పునర్నిర్మాణానికి అపూర్వ అవకాశం అని అన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రరాజ్యంగా ఆవిర్భవిస్తుందని.. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామ్యం కావాలని బాబు అన్నారు.

2014లో జగన్ మోహన్ రెడ్డి తండ్రి లేని బిడ్డగా ఎన్నికలకు వచ్చారని, 2019లో తండ్రిని చంపి ఆ సానుభూతితోనే ఓట్లు వేయించుకున్నారని కామెంట్స్ చేశారు చంద్రబాబు. ఇప్పుడు వృద్ధుల మరణాలతో ఓట్ల కోసం కుట్రలు చేస్తున్నారన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. మరోవైపు మత రాజకీయాలను, ప్రాంతీయ వివాదాలను రెచ్చగొడుతున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయకపోతే పెను ప్రమాదం సంభవిస్తుందని, జగన్‌కు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎన్డీయే కూటమి గెలిస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వైఎస్సార్‌సీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ కంటే మెరుగైన సంక్షేమ పథకాలను ఎన్డీయే కూటమి అమలు చేస్తుందన్నారు.

We’re now on WhatsApp. Click to Join

జగన్ మోహన్ రెడ్డిలా తన వైఖరి చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నా.. దానిని రాజకీయ కార్యక్రమాలకు వినియోగించాలన్నది ఆయన విధానం. ప్రజావేదికను కూల్చివేసిన జగన్ లాగా తాను ఎప్పుడూ పాత ప్రభుత్వాలు చేసిన వాటిని నాశనం చేయలేదన్నారు. వాలంటీర్ వ్యవస్థ రాజకీయ పార్టీలకు సేవ చేయకూడదని, ప్రజలకు సేవ చేయాలని తాను మొదటి నుంచి చెబుతున్నానని బుధవారం రాత్రి జరిగిన నిడదవోలు సభలో పేర్కొన్నారు.

Also Read: RR vs GT: గుజరాత్ బౌలర్లని ఉతికారేసిన సంజూ శాంసన్, రియాన్ పరాగ్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Elections 2024
  • bjp
  • chandrababu
  • Jannasena
  • Nidadavole
  • Pawan Kalyan
  • public meeting
  • tdp
  • ys jagan
  • ysrcp

Related News

Ap Legislative Council

మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

ఏపీ శానసమండలిలో(AP Legislative Council) వైసీపీ సభ్యులు శ్రీ వేంకటేశ్వర స్వామి ఫొటోలను ప్రదర్శించడం, టేబుల్‌పై విసిరివేయడంపై ఎన్‌డీఏ మిత్రపక్షాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవదేవుడిని అవమానించడంపై మండిపడ్డారు. ఈ విషయంపై మండలి ఛైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు మంత్రి నారా లోకేశ్‌తో పాటు కూటమి నేతలు వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా సభలో దేవుడి చిత్రాలను ఎలా అనుమతించారని

  • Meeting Of CMs

    India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Atchannaidu Vs Botsa Satyanarayana

    బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

  • Pawan Kalyan's Convoy Meets

    Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

Latest News

  • భారతదేశంలో ప్రస్తుతం ఎక్కువగా ఉన్న క్యాన్సర్లు ఇవే!

  • డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్‌!!

  • శ్రీరాముడిగా మహేష్ బాబు.. వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్ ఇదే!

  • నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ!

  • కారు వాడుతున్నారా? అయితే ఈ వార్త చ‌ద‌వాల్సిందే!

Trending News

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    • టీమిండియా మాజీ ఓపెన‌ర్ ఇంట్లో పెళ్లి సందడి.. సోఫీ షైన్‌తో త్వరలో వివాహం!

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd