Sitaram Yechury : ఇందిరాగాంధీని రాజీనామా చేయమన్న ధీశాలి సీతారాం ఏచూరి :కేటీఆర్
ఇవాళ ఉదయం రవీంద్ర భారతిలో నిర్వహించిన సీతారాం ఏచూరి(Sitaram Yechury) సంస్మరణ సభలో కేటీఆర్ పాల్గొన్నారు.
- By Pasha Published Date - 01:42 PM, Sat - 21 September 24

Sitaram Yechury : ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయమని ఇందిరా గాంధీని డిమాండ్ చేసేంత గుండె ధైర్యమున్న వ్యక్తి సీతారాం ఏచూరి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రశ్నించటమే ప్రజాస్వామ్యమని చెప్పిన గొప్ప వామపక్ష నేత ఏచూరి అని కొనియాడారు. ఇవాళ ఉదయం రవీంద్ర భారతిలో నిర్వహించిన సీతారాం ఏచూరి(Sitaram Yechury) సంస్మరణ సభలో కేటీఆర్ పాల్గొన్నారు.
Also Read :President Droupadi Murmu : 28న హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము.. రాష్ట్రపతి నిలయంలో కళా మహోత్సవాలు
కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘సిద్ధాంతాలకు కట్టుబడి నిలబడిన వ్యక్తి సీతారాం ఏచూరి. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని రాజకీయ ఫిరాయింపుల కాలంలో ఒకే పార్టీకి కట్టుబడి ఉన్న గొప్ప నేత ఏచూరి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘‘బూతులు, తిట్లు చలామణి అవుతున్న కాలంలో సీతారాం జీవితం స్ఫూర్తిదాయకం. మాకు, వామపక్షాలకు సిద్ధాంతపరంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఉద్యమాలు చేసే వ్యక్తులుగా మా అందరిది రక్త సంబంధం. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు మన మౌనం ప్రమాదకరం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read :AP Student Suicide : పాట్నా ఎన్‌ఐటీలో ఏపీ విద్యార్థిని సూసైడ్.. సూసైడ్ నోట్ లభ్యం
‘‘పోరాటాల నుంచి వచ్చిన నాయకులకు ప్రజల కష్టమేంటో తెలుస్తుంది. అలాంటి అతికొద్ది మందిలో ఏచూరి ఒకరు’’ అని కేటీఆర్ తెలిపారు. ‘‘పదవులు లేకున్నా ఐడియాలజీ కోసం పని చేసే ఆలోచన చాలా గొప్పది. ఆయన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోతారు’’ అని పేర్కొన్నారు. ‘‘బతికున్నంత వరకు ప్రజల కోసమే బతకడం కాదు.. చనిపోయాక కూడా తన దేహాన్ని భవిష్యత్‌లో ఈ దేశ ప్రజానీకానికి వైద్యం అందించే డాక్టర్లకు ఉపయోగపడాలనే ఏచూరి ఆశయం చాలా గొప్పది’’ అని కేటీఆర్ కొనియాడారు. ‘‘నమ్మిన సిద్ధాంతం కోసం ఆఖరి వరకు కట్టుబడిన సీతారాం ఏచూరి జీవితం మా లాంటి కొత్త తరం నాయకులకు ఆదర్శ ప్రాయం’’ అని ఆయన చెప్పారు.